»Telecom Regulatory Authority Of India Warning To People Do Not Believe Such Calls
TRAI: ప్రజలకు టెలికామ్ ఆథారిటీ హెచ్చరిక..అలాంటి కాల్స్ నమ్మోద్దు
స్మార్ట్ ఫోన్ యూజర్లను టెలికామ్ రెగ్యూలేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా మరోసారి హెచ్చరించింది. కాల్స్ చేసి ఎవరైనా ఆధార్ కార్డు ఇవ్వకపోతే బ్లాక్ చేస్తామని అంటే అలాంటి వాటిని పట్టించుకోవద్దని స్పష్టం చేసింది.
Telecom Regulatory Authority of India warning to people.. Do not believe such calls
Fake calls: ఈ మధ్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ కొన్ని ఫేక్ కాల్స్(Fake Calls) వస్తున్నాయి. ట్రాయ్(TRAOI) నుంచి కాల్ చేస్తున్నట్లు ఆధార్ కార్డు(Adhar Card) ఇవ్వకపోతే మీ ఫోన్ నెంబర్‌ను శాశ్వతంగా బ్లాక్ చేస్తామని, లేదా డిస్కనెక్ట్ చేస్తామనే బెదిరింపుకాల్స్ వస్తున్నాయి. వాటిని చూసి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా వీటిపై స్పందించిన టెలికామ్ రెగ్యూలటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా ఇలాంటి కాల్స్ ను నమ్మోద్దని చెప్పింది. కస్టమర్ల ఆధార్ కార్డు, ఇతర డిటైల్స్‌ను ట్రాయ్ ఎప్పుడు అడగదని, మీ మొబైల్ నెంబర్‌ను ఎప్పుడు బ్లాక్ చేయదని స్పష్టం చేశారు.
ఈ మధ్య కొన్ని కంపెనీలు, ఏజన్సీలు నిబంధనలకు వ్యతిరేకంగా వినియోగదారుల నుంచి డేటాను చోరీ చేస్తుందన్నారు. వాటిని చట్టవిరుద్ధమైన పనులకు ఉపయోగిస్తుందని ట్రాయ్ పేర్కొంది. ఈ కాల్స్‌పై ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. అలాగే మెసెజ్‌ల రూపంలో కొన్ని లింకులను కూడా పంపుతున్నారని, అనవసరమైన లింకులను ఓపెన్ చేయడం, మీ వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయడం సరైనది కాదని తెలిపింది. ఈ మధ్య చాలా మంది సైబర్ నేరాలకు బలవుతున్నారని, అలాగే ఎవరైనా కాల్ చేసి బెదిరించినా దగ్గర్లోని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.