»Reliance Industries Tata Group Partner Nvidia For India Ai Infrastructure
NVIDIA:తో రిలయన్స్, టాటా గ్రూప్ ఇండస్ట్రీస్ ఒప్పందం
భారత్‌లో ఎఐ సాయంతో సూపర్ కంప్యూటర్లను తయారుచేేసేందుకు రిలయన్స్, టాటా గ్రూప్ రెండు దిగ్గజ కంపెనీలు అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీ Nvidia తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ మేరకు రిలయన్స్ గ్రూప్ ఓ ప్రకటనలో తెలిపింది.
India AI: ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రాధాన్యత సంతరించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారతదేశంలోని రెండు అతిపెద్ద బిజినెస్ దిగ్గజ కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), టాటా గ్రూప్ కలిసి AI సూపర్ కంప్యూటర్లను రూపొందించడానికి సిద్దం అయ్యాయి. అందుకోసం అమెరికా టెక్నాలజీ దిగ్గజం Nvidiaతో ప్రత్యేక భాగస్వామ్యం చేసుకున్నాయి.
రిలయన్స్ డిజిటల్ సేవల విభాగం అయిన జియో(Jio) ప్లాట్‌ఫారమ్‌లు, అత్యాధునిక క్లౌడ్-ఆధారిత AI కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి Nvidiaతో భాగస్వామ్యాన్ని శుక్రవారం ప్రకటించింది. Nvidia Jioకి ఎండ్-టు-ఎండ్ AI సూపర్ కంప్యూటర్ టెక్నాలజీలు, అత్యంత అధునాతన AI మోడల్లను రూపొందించడానికి ఫ్రేమ్‌వర్క్‌లను అందిస్తుంది. ఇదే విషయాన్ని జియో(Jio) ఒక ప్రకటనలో తెలిపింది.
AI కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, AI సొల్యూషన్లను అభివృద్ధి చేసే ప్లాట్‌ఫారమ్‌లను అందించడానికి Nvidia టాటా గ్రూప్‌తో కూడా ఒప్పందం చేసుకుంది. కొత్త మౌలిక సదుపాయాలు AI చాట్బాట్లు, డ్రగ్ డిస్కవరీ, క్లైమేట్ రీసెర్చ్ లాంటి ఎన్నో సేవలను ఇది సమకూరుస్తుంది. అలాగే జియో AI క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్వహిస్తుంది. ఇది కస్టమర్ల్ సదుపాయాలను, వారి అవసరాలను ఎప్పటికప్పుడు గమనిస్తుంది. ఈ సందర్భంగా మన దేశం వేగవంతమైన అభివృద్ధికి సాంకేతిక మౌళిక సదుపాయాలను సృష్టించే దిశగా ముందుకు సాగేందుకే Nvidiaతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్నామని ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు.
చదవండి:South Central Railway: 4 రోజులు సికింద్రాబాద్‌కు పలు రైల్లు బంద్!
దేశీయ విమానాల పరంగా ఇది రెండవ అతిపెద్ద విమానయాన సంస్థ అవుతుంది. ఇండిగో మొదటి స్థానంలో ఉంది. ఎయిరిండియాతో టాటా SIA ఎయిర్‌లైన్స్ విలీనానికి, సింగపూర్ ఎయిర్‌లైన్స్ (SIA) ద్వారా ఎయిర్ ఇండియాలో కొంత వాటాను కొనుగోలు చేయడానికి CCI ఆమోదించినట్లు నోటిఫికేషన్ పేర్కొంది.