Redmi K60 Ultra: ఇండియన్ మార్కెట్లోకి త్వరలో రెడ్మి కే 60 అల్ట్రా (Redmi K60 Ultra) మొబైల్ రానుంది. ఈ మొబైల్ రెడ్మి 50కే అల్ట్రాకు అప్ డేట్ అవనుంది. రెడ్మి కే 60 అల్ట్రా మొబైల్ ఫీచర్స్, ధర విషయానికి సంబంధించిన వార్తలు చైనా సోషల్ మీడియా విబోలో చక్కర్లు కొడుతున్నాయి. భారత మార్కెట్లోకి జూలై రానున్నట్టు తెలుస్తోంది. విబో ప్రకారం ఫీచర్స్ ఇలా ఉంటాయని తెలుస్తోంది.
మొబైల్ ప్రీమియం లుక్లో ఉండనుంది. మెటల్ ఫ్రేమ్ కలిగి ఉండనుంది. 100 వైట్ల వైర్డ్ ఛార్జీంగ్ ఇస్తారట. ధీర్ఘ చతురస్రాకారంలో కెమెరా మాడ్యూల్ ఉంటుంది. డిస్ ప్లే హోల్ పంచ్ కనిపించింది. వెనకాల ట్రిపుల్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం సింగిల్ కెమెరా ఇచ్చారు. 9200 ఎస్వోసీ డైమెన్ సిటీ ఏర్పాటు చేశారు. ఈ మొబైల్ ధర రూ.35,400 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. రెడ్ మీ కే50 అల్ట్రా మొబైల్ గత ఏడాది చైనాలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కే50 అల్ట్రా (K50 Ultra) మొబైల్ 6.7 ఇంచుల ఓలెఈడీ డిస్ ప్లే కలిగి ఉంది. 8 ప్లస్ జెనరేషన్ ఎస్వోసీ కలిగి ఉంది. ఈ మొబైల్ కూడా ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ప్రైమరీ కెమెరా 108 మెగా పిక్సెల్ ఏర్పాటు చేశారు. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా.. 120 వాట్ల వైర్డ్ చార్జీంగ్ అవుతుంది. దీని అప్ గ్రేడ్ మొబైల్ 100 వాట్లే ఇచ్చారు.