రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకుండా 6.50 శాతం వద్ద వడ్డీ రేటును స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. రెపో రేటులో (repo rate) ఎలాంటి మార్పు చేయకుండా 6.50 శాతం వద్ద వడ్డీ రేటును (policy repo rate unchanged at 6.50 per cent) స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das) గురువారం ప్రకటించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను (RBI monetary policy committee-MPC) ఆయన మీడియాకు వివరించారు. ఎస్టీఎఫ్ రేటు 6.25 శాతం, ఎంఎస్ఎఫ్ రేటు 6.75 శాతం, బ్యాంకు రేటు 6.75 శాతం కొనసాగుతాయనని ప్రకటించారు. ఈ నిర్ణయానికి మానిటరీ పాలసీ కమిటీ (RBI monetary policy) ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందన్నారు. ఈ నెల 3వ తేదీన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. నేడు వివరాలు వెల్లడించారు. ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా ఆర్బీఐ (Reserve Bank of India) గత ఏడాది మే నెల నుండి వరుసగా కీలక వడ్డీ రేట్లను పెంచుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 250 వరకు బేసిస్ పాయింట్లను పెంచింది. 2023 ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్భణం (Retail inflation) 6.44 శాతంగా నమోదయింది. అంతకు ముందు నెల అంటే జనవరితో ఇది 6.52 శాతంగా ఉంది. ద్రవ్యోల్భణం టార్గెట్ పరిధి అయిన 6 శాతానికి పైన స్థిరంగా నమోదు అవుతుండటంతో వడ్డీ రేట్ల పెంపు అనివార్యంగా మారింది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి రియల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (GDP) వృద్ధి రేటు అంచనాలను 6.5 శాతంగా అంచనా వేస్తోంది. మొదటి త్రైమాసికంలో (Q1) 7.8 శాతం, రెండో త్రైమాసికంలో (Q2) 6.2 శాతం, మూడో త్రైమాసికంలో (Q3) 6.1 శాతం, నాలుగో త్రైమాసికంలో (Q4) 5.9 శాతంగా నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్భణం ఈసారి దిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది 5.2 శాతం, తొలి త్రైమాసికంలో 5.1 శాతంగా నమోదు కావొచ్చునని అంచనా వేస్తున్నారు. ఇటీవల బ్యాంకుల పతనం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటుందని, ఈ ప్రభావం మన పైన కూడా ఉంటుందన్నారు.