»Pakistan Inflation Eid Al Adha Chicken And Mutton Price
Pakistan: మేకలు కొనడానికి డబ్బుల్లేవు.. పాక్ లో కోళ్లతో కానిచ్చేశారు
Pakistan: పాక్ ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో తెలిసిందే. నేడు బక్రీద్ పండుగ.. దశాబ్దాల తర్వాత ఈద్ ఉల్-అజా రోజున, చికెన్ కొనడానికి కూడా ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.
Pakistan: పాక్ ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో తెలిసిందే. నేడు బక్రీద్ పండుగ.. దశాబ్దాల తర్వాత ఈద్ ఉల్-అజా రోజున, చికెన్ కొనడానికి కూడా ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈసారి పరిస్థితి పూర్తిగా తారుమారైందని ప్రజలు అంటున్నారు. సాధారణంగా పండుగ సమయంలో మాంసానికి డిమాండ్ పెరగడం వల్ల చికెన్‌కు డిమాండ్ తగ్గుతుంది. అందుకే దాని ధర కూడా తక్కువగా ఉంటుంది. పాకిస్తాన్ పౌల్ట్రీ అసోసియేషన్ అధ్యక్షుడు చౌదరి మహ్మద్ అష్రఫ్ మాట్లాడుతూ.. ఈద్ ఉల్-అజాకు ముందు చికెన్ ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడం 35 ఏళ్ల అనుభవంలో ఇదే మొదటిసారి. పాకిస్థాన్ లో లైవ్ చికెన్ ధర కిలో రూ.560కి చేరగా, మాంసం ధర రూ.820-850కి చేరింది.
అదే సమయంలో, బోన్‌లెస్ చింక్ ధరలు కిలో రూ.1,400కి చేరుకున్నాయి, ఇది గొడ్డు మాంసం కంటే చాలా ఎక్కువ. ప్రస్తుతం పాకిస్థాన్‌లో కిలో గొడ్డు మాంసం రూ.1,100-1,200 మధ్య విక్రయిస్తున్నారు. డిమాండ్‌తో పోలిస్తే మార్కెట్లో లైవ్ కోళ్ల సరఫరా 40 శాతం మాత్రమే ఉందని అష్రఫ్ తెలిపారు. మాంసం కొనుగోలు చేసేవారి సంఖ్య భారీగా తగ్గిందని మార్కెట్‌తో సంబంధం ఉన్నవారు చెబుతున్నారు. విపరీతంగా పెరిగిన ధరలతో మార్కెట్‌కు వస్తున్న కొందరు ఖాళీ చేతులతో వెనుదిరుగుతున్నారు. మాంసాహారం కొంటే మొత్తం బడ్జెట్ కూడా పాడైపోయేంతగా ధరలు పెరిగాయి.