ఇండియన్ పోస్ట్ తమ ఖాతాదారుల కోసం కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. కొత్తగా రూపొందించిన ఈ కేవైసీ రూల్స్ వల్ల ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టేవారికి తీవ్ర ఇబ్బందులు తలెత్తవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈరోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలే కనిపిస్తున్నాయి. మార్కెట్లోకి కూడా కొత్త రకం ఎలక్ట్రిక్ వాహనాలు సందడి చేస్తున్నాయి. ఇప్పటి వరకు మనకు కార్లు, స్కూటర్లు మాత్రమే తెలుసు. తాజాగా ఎలక్ట్రిక్ త్రీవీలర్ వాహనం కూడా అడుగుపెట్టింది.
టాలీవుడ్ హీరోలు.. కేవలం హీరోలుగా మాత్రమే కాదు బిజినెస్ పరంగాను దూసుకుపోతున్నారు. దేశ విదేశాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. అలాగే కమర్షియల్‌గా రెండో చేత్తో గట్టిగానే వెనకేసుకుంటున్నారు. అల్లు అర్జున్ కూడా రేసుగుర్రంలా పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతున్నాడు. ఇక ఇప్పుడు మల్టీప్లెక్స్ నిర్మాణంలోను అడుగు పెట్టాడు. ఆ మల్టీ ప్లెక్స్‌ను ప్రభాస్ కొత్త సినిమాతో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
హైదరాబాద్ నగరానికి చెందిన మహిమ 75 ఏళ్ల చరిత్ర గల హైదరాబాద్ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఇ లిమిటెడ్‌కు ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. 2022లో రూ.7700 కోట్లుగా ఉన్న మహిమా దాట్ల ఆస్తుల విలువ ఇప్పటి వరకూ రూ.8700 కోట్లకు చేరుకుంది.
ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ AJIO జూన్ 1, 2023 నుంచి ప్రారంభం కానున్న తన 'బిగ్ బోల్డ్ సేల్'ని ప్రకటించింది. ఈ మెగా సేల్ కోసం వినియోగదారులకు ముందస్తు యాక్సెస్ ఇవ్వబడుతుందని పేర్కొన్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో త్వరలో ముడి చమురు(crude oil) ధరలో భారీ తగ్గుదల కనిపించవచ్చు. ప్రస్తుతం అమెరికా(America) ఆంక్షల కింద ఉన్న ఒపెక్(OPEC)కు ఇరాన్(Iran) తిరిగి రావడమే దీనికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. ముడి చమురు ఉత్పత్తి సంస్థ ఒపెక్ సెక్రటరీ జనరల్ హైథమ్ అల్ ఘైస్ ఇరాన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఐపీఎల్ (ipl 2023) టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 5వ సారి గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై CSK 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
దేశంలో రూ.2వేల నోటు ను నిషేధిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో.. ఆ నోటీను బ్యాంకులో ఉపసంహరించుకుంటున్నారు. గతవారం ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, సజావుగా సాగుతుందని తెలుస్తోంది.
నాలుగేళ్లుగా జీసీసీ చేస్తున్న కృషి వల్ల అరకు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు పండించే కాఫీ, మిరియాలకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ లభించడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ నేపథ్యంలో రైతులకు జీసీసీ(GCC) సేంద్రియ ధ్రువ పత్రాలను అందించనుంది.
ప్రముఖ క్యాబ్ సర్వీస్ ఓలా గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈరోజుల్లో దేశంలోని అన్ని నగరాల్లో ఓలా సర్వీసులు ఉన్నాయి. చాలా మంది క్యాబ్ లలో ప్రయాణించాలంటే ఓలానే ఎంచుకుంటారు. కాగా, ఓలా తాజాగా సరికొత్త సర్వీసును అందించడానికి రెడీ అయ్యింది.