»Bengaluru A Driverless Car On The Streets The Video Has Gone Viral
Bengaluru : వీధుల్లోకి వచ్చేసిన డ్రైవర్ లేని కారు..వీడియో వైరల్
డ్రైవర్ లేని కారును మైనస్ జీరో అనే స్టార్టప్ కంపెనీ రెడీ చేస్తోంది. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలోనే ఉంది. త్వరలోనే ఈ కారు అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని వీధుల్లో ఈ కారు ప్రత్యక్షం అవ్వడంతో స్థానికులు వింతగా చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మార్కెట్లోకి అద్భుతమైన టెక్నాలజీ(Technology) యంత్రాలు వచ్చేస్తున్నాయి. నూతన ఆవిష్కరణలకు వ్యాపార రంగం పెద్దపీట వేస్తోంది. రోజురోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో డ్రైవర్ లేని కారు త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. తాజాగా ఈ కారు బెంగళూరు సిటీ రోడ్ల (Bengaluru city Roads)పై తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Video Viral) అవుతోంది. ఆ కారును చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
బెంగళూరులో రోడ్డుపై తిరుగుతున్న డ్రైవర్ లేని కారు వీడియో:
అనిరుధ్ రవిశంకర్ అనే ట్విట్టర్ యూజర్ (anirudh ravishankar) డ్రైవర్ లేని కారు వీడియోను షేర్ చేశారు. బెంగళూరు రోడ్లపై డ్రైవర్ లేని కారు తిరుగుతుంటే స్ధానికులు వింతగా చూస్తున్నారు. ఆ కారును చూస్తుంటే హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలోని వాహనంలా కనిపిస్తోందని చర్చించుకుంటున్నారు. ‘బెంగళూరు వీధుల్లో’ అంటూ అనిరుధ్ రవిశంకర్ కారు వీడియోను షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు రీట్వీట్స్ చేస్తున్నారు.
‘ఇండియన్ సైబర్ ట్రక్’ అని ఈ కారుకు పేరు. ‘ఇది 27వ ప్రధాన రహదారి లేన్లో కనిపించిందని, దీనిని పరీక్షిస్తున్నారని’ పలువురు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. zPod అనేది సెల్ఫ్ డ్రైవింగ్ కారును బెంగళూరులోని ఒక అటానమస్ మొబిలిటీ స్టార్టప్ అయిన మైనస్ జీరో సిద్ధం చేస్తోందని, అయితే ఇది ఇంకా ప్రయోగ దశలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ కారు అందరికీ అందుబాటులోకి రానుంది.