»Elon Musk Announces Twitters Logo Change To Bid Farewell To All The Birds
Elon Musk: ఎగిరిపోనున్న ట్విట్టర్ ‘బర్డ్’..ఎలాన్ మస్క్ కొత్త లోగో ‘ఎక్స్’
ఈ రోజు రాత్రి నుంచి ట్విట్టర్ లోగో మారిపోనుంది. ఇప్పటి వరకూ ఉన్న బర్డ్ లోగోకు బదులకుగా ఇకపై ఎక్స్ లోగో ప్రత్యక్షం కానుంది. దీనిపై ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటన చేశారు.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్(Twitter) తన లోగో(Logo)ను మారుస్తోంది. గతేడాది అక్టోబర్‌లో ట్విట్టర్ ను ఎలాన్ మస్క్(Elon Musk) సొంతం చేసుకున్న తర్వాత ఆ సంస్థలో సమూల మార్పులను తీసుకొచ్చారు. తాజాగా ట్విట్టర్ లోగో(Twitter Logo)ను పూర్తిగా మార్చేస్తామని ఆయన పరోక్షంగా తెలిపారు. ఇప్పుడు దానిని నిజం చేస్తూ ‘ఎక్స్’ (X) అనే అక్షరంతో కూడిన లోగో సరిపోతుందని ట్వీట్ చేశాడు. ఈ లోగోను బట్టీ ట్విట్టర్ బ్రాండ్‌కు, దానిగుర్తుగా ఉన్న అన్ని పక్షులకు వీడ్కోలు చెపుతామని ఆయన తెలిపారు.
లోగోకు సంబంధించి ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్:
And soon we shall bid adieu to the twitter brand and, gradually, all the birds
ఆదివారం రాత్రి నుంచి ‘ఎక్స్’ లోగో (X Logo) ప్రపంచ వ్యాప్తంగా లైవ్‌లోకి వెళ్తుందని ఎలాన్ మస్క్(Elon Musk) స్పష్టం చేశారు. ట్విట్టర్లో మొదటి నుంచి ఎలాన్ మస్క్ అనేక మార్పులు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం లోగో మార్పుపై నెటిజన్లు, యూజర్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు కొత్త లోగో(New Logo) కోసం ఎదురుచూస్తున్నామని అంటుంటే, మరికొందరు లోగోను మార్చి పొరపాటు చేయొద్దని సలహాలు ఇచ్చారు.
ఈ మధ్యనే ఎలాన్ మస్క్(Elon Musk) తన ట్విట్టర్ కంపెనీని తాను కొత్తగా ఏర్పాటు చేసిన ‘ఎక్స్ కార్ప్’ సంస్థలో విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించారు. తనకు ‘ఎక్స్’ అనే అక్షరం అంటే చాలా ఇష్టం అని మస్క్ తెలిపారు. ఇటీవలె ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన లిండా యాంకరినో కూడా ‘ఎక్స్’ లోగో (X Logo) మార్చడంలో కీలక పాత్ర పోషించినట్లు ఎలాన్ మస్క్ ట్వీట్టర్ (Twitter) వేదికగా వెల్లడించారు.