రోల్డ్‌గోల్డ్ (Roldgold) నగలతో కారణంగా చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద, మంట.. వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యతో బాధపడేవారు, దీన్ని నుంచి ఎలా బయటపడాలో చిన్నచిన్న చిట్కాలు చూద్దాం ఆర్టిఫిషియల్ (Artificial) నగల అలర్జీ ఉన్నవారు వాటిని వేసుకునే ముందు పౌడర్, మాయిశ్చరైజర్, క్యాలమైన్ లోషన్స్ రాసుకుంటే మంచిది. ఇవి మీ చర్మాన్ని రక్షిస్తాయి, మెటల్ ఎఫెక్ట్ నుంచి మీ చర్మంపై పడకుండా చూసుకుంటాయి.నగలు ధరించే ముందు వాటిపై ఓ కోటింగ్ ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ (Nail polish) వేయండి. ఇలా చేస్తే మెటల్ ప్రభావం చర్మంపై పడదు. ట్రాన్సపరెంట్ కలర్ ..ఉన్న నెయిల్ పాలిష్ వేస్తే ఆ వస్తువు అందం ఏం డ్యామేజీ కాదు . కాబట్టి ఇది ట్రై చెయ్యండి. కొంతమంది చోకర్, నెక్‌పీస్ (Neckpiece) ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
కానీ ఆర్టిఫిషియల్ నగల అలెర్టీ ఉన్నవారు టైట్‌గా ఉండే జ్యూయలరీ(Jewellery)కి దూరంగా ఉండటమే మంచిది. మెడకు టైట్‌గా పెట్టే నగలు కాస్త అవాయిడ్ చెయ్యండి. మీరు లాంగ్ చెయిన్స్, హారాలు వేసుకుంటే మంచిది.కొంతమంది నగలు తడిసినా, చెమట పట్టినా.. అలాగే వాటిని బాక్సుల్లో పెట్టి స్టోర్ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే నగలు దెబ్బతినడంతో పాటు, శరీరం(body)అలర్జీలకు కారణం అవుతుంది. మీరు నగలు తీసిన తర్వాత, అవి ఆరిన తర్వాత స్టోర్ చేయడం మంచిది. వాటిని కాటన్ లో పెట్టి స్టోర్ చెయ్యడం అలవాటు చేసుకొండి. ఆర్టిఫిషియల్ జ్యుయలరీతో అలర్జీ (Allergy) సమస్య వస్తుందనుకునే వారు …వెండి నగలు ట్రై చెయ్యండి అవి కూడా చాలా మంచి మోడల్స్ వస్తున్నాయి. నగల వల్ల చర్మంపై దురదగా అనిపిస్తే.. ఆ ప్రదేశంలో కలబంద గుజ్జును అప్లై చేసుకోవాలి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు సమస్య నుంచి ఉపశమనం (Relief) అందిస్తాయి.