ప్రస్తుతం ఏఐ టెక్నాలజి ఎంత దూసుకుపోతుందో అందరికి తెలిసిందే. రాబోయే రోజుల్లో మానవులను పెళ్లి చేసుకొనే విధంగా అవి రూపుదిద్దుకోనున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Viral News: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(artificial intelligence) నేడు ఎలాంటి ప్రాధాన్యతను సంతరించుకుందో చూస్తూనే ఉన్నాము. ఏఐతో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రానున్న కాలంలో మానవ సంబంధాలను కూడా ప్రభావితం చేయనున్నట్లు తెలుస్తుంది. పాతికేళ్లలో రోబోలతో పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో అభివృద్ధి చేసే ఏఐ టెక్నాలజీతో పెళ్లిళ్ల అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన మానవ నిపుణుడు, అనేక ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లింగ్ పుస్తకాలు రాసిన రచయిత యువాల్ నోవా హరారి లండన్లోని సెపియన్స్ ల్యాబ్లో నిర్వహించిన ఒక కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని తెలిపారు.
ఏఐ రోబోలు ఆలోచించటానికి సమయం తీసుకోవని, కేవలం సంబంధాలపైనే తాము అనుకున్నది మాట్లాడటం, భావోద్వేగాలు వ్యక్తం చేయడంపైనే అవి ఎక్కువ శ్రద్ధ పెడతాయని అన్నారు. ఒక వ్యక్తికి అందుబాటులో ఏఐ రోబో, వ్యక్తులు ఉన్నట్లయితే ఏఐ రోబోనే ఆకర్షిస్తుందని చెప్పారు. 2050 వరకు ప్రేమించే ఫిమేల్ ఏఐ రోబోలు ఇప్పటివరకు ఫిమేల్ ఉమెనాయడ్ రోబోలు మానవుల ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నాయని, అంతేకాకుండా పురుషుల ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్నాయి. ఇది ఒక విధంగా మహిళల విజయంగా కొందరు వర్ణించారు. కానీ రాబోయే కాలంలో ఫిమేల్ రోబోలు పురుషులకే కాదు, మహిళలకు కూడా ఒక పెద్ద చాలెంజ్ గా తయారవుతాయని స్కాట్లాండ్కు చెందిన ఏఐ నిపుణుడు డేవిడ్ లేవి 2007లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘లవ్ అండ్ రొమాన్స్ విత్ రోబో’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. తన పుస్తకంలో రాబోయే కాలంలో మానవులకు -రోబోలకు మధ్య భార్యాభర్తల సంబంధాలు, ఇంకా రొమాంటిక్ సంబంధాలు సంభవమేనని అని పేర్కొన్నారు.
ప్రపంచంలో ఫిమేల్ రోబోగా ఆదరణ పొందిన మొదటి సెలబ్రిటీ రోబో సోఫియా(Sofia). ఇది ముఖాన్ని ధ్వనిని గుర్తించగలదు. ప్రజలతో కలిసి మెలిసి ఉండే రోబో ఇది. అందుకే సౌదీ అరేబియా సోఫియాకు పౌరసత్వం ఇచ్చింది. మరొక రోబో గ్రేస్(Grace). ప్రపంచంలో మొదటి రోబో నర్సు. కోవిడ్ -19 కాలంలో పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తూ సేవలు బాగా అందించింది. మూడు భాషలు మాట్లాడుతుంది. మరో ఫిమేల్ రోబో ఆ-యిడా(Aa-yida) ఇప్పటివరకు తయారైన ఉమెనాయిడ్ రోబోలలో అత్యాధునికమైన రోబో. అల్ట్రా రియలిస్టిక్ రోబోగా దీనికి అవార్డు వచ్చింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లెక్చరు కూడా ఇచ్చింది.