మీరు బ్యాంకు నుండి హోమ్ లోన్, కారు లోన్ తీసుకున్నప్పుడల్లా, సదరు బ్యాంకు మీ నుండి వడ్డీని వసూలు చేస్తుంది. అదేవిధంగా, మీరు క్రెడిట్ కార్డ్ చెల్లింపులో ఆలస్యం చేసినప్పుడు బ్యాంకు మీకు ఫైన్ వేస్తుంది.
చాలా సార్లు బీమా పాలసీ ప్రీమియాన్ని సకాలంలో చెల్లించలేకపోవడం వల్ల మీ పాలసీ ల్యాప్స్ అవుతుంది. చాలా కాలంగా మూసివేయబడిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీని మీరు కూడా కలిగి ఉన్నట్లయితే ప్రస్తుతం మళ్లీ మీరు దాన్ని రీ ఓపెన్ చేయవచ్చచు.
ఇటీవల ఫోర్బ్స్ భారతదేశంలోని 100 మంది సంపన్నుల కొత్త జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం 2023 సంవత్సరంలో భారత్, ఆసియాలో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీగా తేలింది.
బైక్ రైడర్లకు శుభవార్త చెప్పింది ఓలా కంపెనీ. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను అద్దెకు ఇచ్చి నెలకు రూ. 70వేలను సంపాదించుకునే అవకాశం కల్పిస్తోంది. దీనికి సంబంధించిన ఆఫర్‌ను ప్రకటించింది.
విదేశీ మార్కెట్లలో గోల్డ్ రేట్లు(Gold rates) పెరిగిన నేపథ్యంలో శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో గోల్డ్ ధర భారీగా పెరిగింది. ఈ క్రమంలో 10 గ్రాముల గోల్డ్ ధర రూ.750 పెరిగి రూ.61,650కి చేరుకుందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ తెలిపింది. అంతకుముందు 10 గ్రాములకు రూ.60,900 వద్ద ఉండేది.
శ్రీహరికోటలోని షోర్ రేంజ్లో శుక్రవారం సాయంత్రం 7.30 గంటలకు ఇస్రో ప్రతిష్టాత్మక గగన్ మిషన్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 2025 నాటికి తన రాకెట్‌తో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలని యోచిస్తోంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ క్షీణత బాటలో సాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల ఒత్తిడి మధ్య, రెండు ప్రధాన దేశీయ సూచీలు గురువారం భారీ నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్ ప్రారంభమైన వెంటనే 400 పాయింట్లకు పైగా పడిపోయింది.
దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో తన మాతృ సంస్థ విప్రో లిమిటెడ్‌లో ఐదు అనుబంధ కంపెనీలను విలీనం చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. బుధవారం దాని షేర్లు దాదాపు 1 శాతం పడిపోయి ఒక్కో షేరుకు రూ.407.50 వద్ద ముగిసింది. బోర్డు సమావేశంలో విలీనంపై నిర్ణయం తీసుకున్నారు.
దేశం.. తన మొట్టమొదటి ర్యాపిడ్ రైలు బహుమతిని త్వరలో అందుకోబోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 20న దేశంలోని సాధారణ ప్రజలకు ర్యాపిడ్ రైలును అంకితం చేయనున్నారు.
వచ్చే నెల నవంబర్‌లో దీపావళి, ధంతేరస్ వంటి పండుగలు ఉన్నాయి. ఈ పండుగ సీజన్లో దేశవ్యాప్తంగా భారీగా వ్యాపారం జరుగుతుందని వ్యాపారులు భావిస్తున్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ప్రకారం, దేశవ్యాప్తంగా సుమారు రూ. 3 లక్షల కోట్ల విలువైన వాణిజ్యం జరుగుతుందని అంచనా.
భారత స్టాక్ మార్కెట్లు(stock markets) బుధవారం భారీ నష్టాల్లో దూసుకెళ్తున్నాయి. US ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయాలతోపాటు ఆసియా మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒకనొక దశలో సెన్సెక్స్(sensex), బ్యాంక్ నిఫ్టీ 500కుపైగా పాయింట్లను కోల్పోయింది.
ప్రస్తుతం వరల్డ్ కప్ ఫీవర్ ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులను ఆవహించింది. పాకిస్థాన్‌ను భారత్ ఓడించినప్పటి నుంచి... భారత్ ప్రపంచ కప్ కొట్టాలని ప్రతీ భారతీయుడు ఆశిస్తున్నాడు.
హజ్మోలా, చ్యవాన్‌ప్రాష్, హనీ, హెయిర్ ఆయిల్ వంటి అనేక ఉత్పత్తులను తయారు చేస్తున్న దేశంలోని అతిపెద్ద ఎఫ్ఎంసి కంపెనీలలో ఒకటైన డాబర్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.