పూర్తిస్థాయి ఆర్థిక సేవల సంస్థగా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మారింది. ఇకపై ఆటో లోన్స్, హోమ్ లోన్స్ ఇవ్వనుంది. అలాగే డెబిట్ కార్డులు కూడా జారీచేస్తామని కంపెనీ చెబుతోంది.
సెప్టెంబర్‌లో వరుసగా ఆరవ నెలలో భారతదేశ టోకు ద్రవ్యోల్బణం(WPI) ప్రతికూల స్థాయిలోనే నమోదైంది. సెప్టెంబర్‌లో టోకు ధరల సూచీ (WPI) గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 0.26 శాతం క్షీణించింది. అయితే తగ్గడానికి గల కారణాలెంటో ఇప్పుడు చుద్దాం.
ప్రస్తుతం కేపీఐటీ టెక్నాలజీస్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లో హాట్ కేక్ లా ఉంది. గత మూడేళ్లలో దీని షేర్లు దాని కస్టమర్లకు బంపర్ రిటర్న్స్ అందించింది. కేపీఐటీ టెక్నాలజీస్ లిమిటెడ్ తన కస్టమర్లకు కేవలం మూడేళ్లలో 962 శాతం రాబడిని అందించిందని చెబుతున్నారు. అంటే, ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్ల అదృష్టం వెలుగుచూసింది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ను లక్ష మందికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించగా, కొన్ని కోట్ల మంది ప్రజలు స్టేడియం వెలుపల తమ ఇళ్లలో మ్యాచ్‌ను ఆస్వాదించారు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత స్టేడియం మాత్రమే కాదు రెస్టారెంట్లు, బార్లు, పబ్‌లు, స్విగ్గీ ఇలా అన్నింటిలోనూ భారీ వసూళ్లు వచ్చాయి.
దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత తమిళనాడు తూర్పు తీరంలోని నాగపట్నం -శ్రీలంక ఉత్తర ప్రావిన్స్‌లోని కంకేసంతురై మధ్య అంతర్జాతీయ, హై-స్పీడ్ ప్యాసింజర్ ఫెర్రీ సర్వీస్ శనివారం పునఃప్రారంభమైంది.
చౌక విమానయాన సంస్థ స్పైస్‌జెట్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. దీని పరిస్థితి ఎప్పుడు మెరుగుపడుతుందనే దానిపై స్పష్టత లేదు. కంపెనీ ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పీకల్లోతు అప్పులపాలయ్యింది.
గత దశాబ్దంలో స్టాక్ మార్కెట్‌ను శాసించిన కంపెనీలలో ఒకటి దీపక్ నైట్రేట్ షేర్. గత 10 ఏళ్లలో కంపెనీ షేర్ల ధరలు 6500 శాతం పెరిగాయి. దీపక్ నైట్రేట్‌లో 10 సంవత్సరాల క్రితం ఇన్వెస్టర్ రూ.10,000 పెట్టుబడి పెడితే, అతని డబ్బు ఈపాటికి రూ.6.5 లక్షలకు పెరిగింది.
విదేశాల నుంచి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌ల దిగుమతిని నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఇప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా విదేశాల నుంచి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లను తీసుకురావచ్చు.
దసరా పండుగ గ్రేట్ ఇండియా సేల్‌లో భాగంగా బ్రాండెడ్ వాచులు అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఫాస్ట్రాక్, యాపిల్, శామ్‌సంగ్ స్మార్ట్ వాచెస్‌ను 90 శాతం తగ్గింపు ధరలతో అమెజాన్లో అందుబాటులో ఉన్నాయి. ఆ ఆఫర్లు ఎంటో ఇప్పుడు చుద్దాం.
ప్రస్తుతం ఫుడ్ డెలివరీ వ్యాపారంలో దూసుకెళ్తున్న జొమాటో సంస్థ కొత్తగా మరో వ్యాపారంలోకి ప్రవేశించింది. ఇక నుంచి వ్యాపారస్తుల కోసం చిన్న చిన్న పార్సెళ్లను కూడా డెలవరీ చేయనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో వ్యాపారుల కోసం ప్రత్యేకంగా Xtremeని ప్రారంభించినట్లు స్పష్టం చేసింది.
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ చైన్ మెక్‌డొనాల్డ్స్ లకు జోధ్ పూర్ లోని వినియోగదారుల కోర్టు భారీ జరిమానా విధించింది. తమకు లక్ష రూపాయల జరిమానా విధించినట్లు జొమాటో స్వయంగా శుక్రవారం వెల్లడించింది.
శామ్‌సంగ్, మోటోరోలా ఇప్పటికే ఫ్లిప్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. తాజాగా ఒప్పో సంస్థ ఫ్లిప్ ఫోన్‌ను లాంచ్ చేసింది. మరి ఈ ఫ్లిప్ ఫోన్ ఎప్పటి నుంచి మార్కెట్లోకి లభ్యమవుతుంది. దీని ఫీచర్లు ఏంటి? తెలుసుకుందాం.