వాణిజ్య బ్యాంకులు రూ.2000 నోట్లను స్వీకరించడం నిలిపివేసిన తర్వాత నవంబర్ 30 వరకు 97.26 శాతం నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.
టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (టాటా టెక్)షేర్లు గురువారం దలాల్ స్ట్రీట్‌లో బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చాయి. దాని షేర్లు ఏకంగా 140 శాతం పెరిగి రూ.1,200 వద్ద లిస్ట్ అయ్యాయి. దీంతో ఈ షేర్లు తీసుకున్న మదుపర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ నికర విలువ ఒక్కసారిగా పెరిగింది. ఒక్క రోజే రూ.లక్ష కోట్ల ఆదాయం రావడంతో సంపన్నుల జాబితాలో ఆయన మరో రెండు స్థానాలు ఎగబాకారు. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల్లో టాప్20 జాబితాలోకి ఎంట్రీ ఇచ్చారు.
జీవిత బీమా గురించిన ఆలోచన వచ్చినప్పుడల్లా, ముందుగా గుర్తుకు వచ్చే పేరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC). ఈ సంస్థ ఈరోజు కొత్త పాలసీని ప్రారంభించింది. ఈ పాలసీ పేరు జీవన్ ఉత్సవ్. ఈ పాలసీలో, పాలసీదారుడు అధిక వడ్డీ రేటుతోపాటు అనేక సౌకర్యాల ప్రయోజనాన్ని పొందుతారు.
తక్కువ ధరలో రెడ్మి 12c 5జీ ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. కొత్తగా 5జీ ఫోన్ తీసుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని నెటిజన్లు అంటున్నారు. మరి ఆ ఫోన్ ధర, ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
గత ఏడాదితో పోలిస్తే లగ్జరీ ఇళ్ల విక్రయాలు భారీగా పెరిగాయని రియల్ ఎస్టేట్ సంస్థ సీబీఆర్‌ఈ ఓ నివేదికలో తెలిపింది. ఆర్థిక స్థోమత ఉన్నవారు, ఎన్ఆర్ఐలు తమ అభిరుచికి తగ్గట్టుగా ఇంటిని నిర్మించుకుంటున్నారని పేర్కొంది. అయితే ఈ లిస్ట్‌లో హైదరాబాద్ టాప్ 3లో ఉండటం విశేషం.
కార్లు కొనాలని ఎవరైనా అనుకుంటే ఇదే ఏడాది కొనుగోలు చేయండి. ఎందుకంటే వచ్చే ఏడాది పలు కంపెనీలు పలు మోడల్ కార్ల రేట్లను పెంచనున్నట్లు ప్రకటించాయి. అయితే వాటిలో ఏయే కంపెనీలు ఉన్నాయి. వాటి విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఇకపై పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డులు పొందాలంటే అంతా సులభం కాదు. రుణం పొందాలంటే క్రెడిట్ స్కోర్, సీయూఆర్ ఎంత ఉండాలో ఆర్‌బీఐ తాజా నిబంధనలు వెలువరించింది. ఖాతా ఉన్న బ్యాంకులోనే రుణం తీసుకోవాలని, అలా చేస్తే అనేక లాభాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
తమ దేశంలో పర్యాటకం, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు మలేషియా ప్రభుత్వం(malaysia govt)కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయులు, ముఖ్యంగా భారతదేశం, చైనా నుండి పర్యాటకులు వీసా లేకుండా తమ దేశానికి రావడానికి అనుమతించబడ్డారు.
దేశంలోని టాప్-5 ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడాపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ భారీ జరిమానా విధించింది. సిటీ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులకు కూడా కోటి రూపాయల జరిమానా విధించింది.
టెక్ రంగంలో మరో భారీ డీల్ కుదిరింది. US-ఆధారిత హార్డ్‌వేర్ కంపెనీ బ్రాడ్‌కామ్.. డెస్క్‌టాప్ వర్చువలైజేషన్ సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ VMwareను సొంతం చేసుకుంది. అందుకోసం ఏకంగా 69 బిలియన్ డాలర్లను(రూ.5.7 లక్షల కోట్లు) ఆఫర్ చేసింది.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్, బాబా రామ్‌దేవ్ కు చెందిన పతంజలి ఇప్పుడు ఒకరితో ఒకరు ముఖాముఖిగా వచ్చారు. ఒకరోజు ముందు తప్పుదోవ పట్టించే ప్రకటనలపై రామ్‌దేవ్‌కు చెందిన పతంజలిని సుప్రీంకోర్టు మందలించింది.