»Ola Electric Cuts Its Scooter Prices By Up To Rs 25000
Ola Electric Scooters: ఓలా స్కూటర్లపై రూ.25 వేల వరకు తగ్గింపులు
తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలతో మార్కెట్లో తమదైన ముద్ర వేసుకుంది ఓలా కంపెనీ. ఇప్పుడు కొనుగోలుదారులను మరింత ఆకర్షించేందుకు ధరలపై మరింత డిస్కౌంట్లను అందిస్తోంది. వివరాల్లోకి వెళితే...
discount on ola scooters : ఈ మధ్య కాలంలో ఓలా స్కూటర్లు చాలా మంది కొనుక్కుంటున్నారు. ఈ అమ్మకాల ఊపును కొనసాగించేందుకు కంపెనీ మరింతగా డిస్కౌంట్లను ప్రకటిస్తోంది. అందులో భాగంగా డిసెంబర్, జనవరిల్లోనూ తమ స్కూటర్లపై డిస్కౌంట్లను ఇచ్చింది. తాజాగా ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి మరిన్ని కొత్త డిస్కౌంట్లను ప్రకటించింది. దాదాపుగా రూ.25 వేల దాగా ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ ట్వీట్ చేశారు.
ఓలా ఎస్1(S1) ఎయిర్ మోడల్ ధర ప్రస్తుతం 1.19 లక్షలు ఉంది. డిస్కౌంట్ తర్వాత ఈ ఓలా స్కూటర్ (Ola scooter) రూ.1.04 లక్షలకు లభిస్తుంది. మీరు S1 ఎక్స్ ప్లస్ స్కూటర్ కావాలంటే ప్రస్తుతం దాని ధర రూ.1.09 లక్షలు ఉంది. తగ్గింపు తర్వాత ఇది రూ.84,999కి లభిస్తుంది. అలాగే ఎస్1 ప్రో, ఎస్ ఎయిర్, ఎస్1 ఎక్స్ ప్లస్ మోడళ్లకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఆ లెక్కన చూస్తే S1 ప్రో మోడల్ ధర ప్రస్తుతం రూ.1,47,499గా ఉంది. డిస్కౌంట్ తర్వాత ఇది రూ.1.29 లక్షలకు లభిస్తుంది.
ఓలా కంపెనీ ఈమధ్య ఎస్ 1 ఎక్స్ శ్రేణిలో 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ తెచ్చింది. దీని ధరను రూ.1.09 లక్షలుగా తెలిపింది. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌తో 190 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని తెలిపింది. బ్యాటరీపై 8 ఏళ్లు లేదా 80వేల కిలో మీటర్ల వరకూ ఎక్స్టెండెడ్ వారంటీని ఉచితంగా ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది.