sea weed : సముద్ర నాచును తింటే ఏమౌతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
విదేశాల్లో సముద్రపు నాచు తినే అలవాటు ఎక్కువగా ఉంది. సూపుల్లాంటి వాటిలో వేసుకుని తాగుతారు. మన దగ్గర మాత్రం దీన్ని తినడం తక్కువ. అయితే దీని వల్ల మనకు లభించే పోషకాలు ఎన్నో. అవేంటంటే..
sea weed eating benefits : మన దేశంలో సముద్రపు నాచును తినడంపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. రోజూ ఒక గ్రాము సముద్రపు నాచును తీసుకుంటే అయోడిన్, ఐరన్, మెగ్నీషియం, జింక్, సెలీనియం, ఇతర సూక్ష్మ పోషకాలు శరీరానికి అందుతాయి. దీంట్లో విటమిన్ సీ, బీలు అధికంగా ఉంటాయి. అందుకే దీన్నిసాంప్రదాయ వైద్యాల్లోనూ విదేశీయులు మందుగా వాడుతుంటారు.
సముద్రపు నాచు(sea weed )ను రోజూ తినడం వల్ల అది శరీరంలో ఎంతో కీలకమైన రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పని చేసేలా చేస్తుంది. ఆస్తమా తదితర శ్వాసకోస సమస్యలకు చెక్ పెడుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. మొత్తం శరీర ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. జీర్ణ క్రియ సక్రమంగా జరిగేలా చూస్తుంది. థైరాయిడ్ ఉన్న వారికి ఇది మందులా పని చేస్తుంది. అనేక రకాల చర్మ సమస్యలను దూరం చేస్తుంది.
సముద్రపు నాచులో ఉన్న యాంటీ వైరల్ లక్షణాల వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చూస్తుంది. లైంగిక సంబంధమైన ఎన్నో సమస్యలకు మందుగా పనికొస్తుంది. సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలకూ పరిష్కారం చూపుతుంది. తొందరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా, చర్మాన్ని కాంతివంతంగా ఉండేలా చూస్తుంది. దీనిలో ఉండే అయోడిన్ స్థాయిల వల్ల ఇది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఈ మధ్య కాలంలో జరిగిన అధ్యయనాల్లో తేలింది. అయితే అతి అనర్థానికి మూలం అన్నట్లుగా దీన్ని అతిగా తినడం వల్ల కొన్ని రకాల అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి మితంగా దీన్ని తీసుకోవడం వల్ల ఎక్కువగా ప్రయోజనాలు చేకూరతాయి.