Gold Rate Today : స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారాన్ని పెట్టుబడి మార్గంగా భావించే వారు రోజు వారీ రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
gold rate today hyderabad and vijayawada december 24th 2023
Gold Rate Today : దేశీయ మార్కెట్లో పసిడి రేట్లు మంగళవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.63,955 ఉండగా, మంగళవారం నాటికి రూ.78 తగ్గి రూ.63,877కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.73,213 ఉండగా, మంగళవారం నాటికి రూ.403 తగ్గి రూ.72,810కు చేరుకుంది.
దేశంలోని ప్రధాన పట్టణాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో పసిడి రేట్లను గమనిద్దాం. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లో పసిడి ధర రూ.63,877గా ఉంది. అలాగే ఈ పట్టణాల్లో కేజీ వెండి ధర కూడా రూ.72,810గా కొనసాగుతోంది. మార్కెట్ ప్రారంభంలోని ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఇవి ఈ రోజులో ఎప్పటికప్పుడు మారుతూ ఉండే అవకాశాలు ఉంటాయి. కొనుగోలుదారులు గమనించుకోవాలి.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, సిల్వర్ రేట్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. సోమవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2021 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 3 డాలర్లు తగ్గి 2018 డాలర్లకు చేరుకుంది. ఇవాళ ఔన్స్ వెండి ధర 22.95 డాలర్లుగా ఉంది.