Gold and Silver Rates Today : స్వల్పంగా తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు
బంగారాన్ని పెట్టుబడి మార్గంగా భావించే వారు రోజు వారీ రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
Gold and Silver Rates : దేశీయ మార్కెట్లో పసిడి రేట్లు గురువారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ.56,900కు చేరింది. అలాగే పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.110 తగ్గి రూ.62,070కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 62.180గా ఉంది. అలాగే 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.5,690గా, 24 క్యారెట్ల గ్రాము పసిడి ధర రూ.6,207గా ఉంది.
దేశంలోని ప్రధాన పట్టణాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముంబయి, కోల్కతా, హైదరాబాద్, కేరళ, పూణేల్లో రూ.62,070గానే ధరలు ఉన్నాయి. అయితే చెన్నైలో రూ.62,620గా ఉంది. అలాగే ఢిల్లీలో రూ.62,220గా ఉంది. అహ్మదాబాద్లో రూ.62,120గా ఉంది.
అలాగే గురువారం కిలో వెండి ధర రూ.1000 వరకు పెరిగింది. దీంతో ఇవాళ వెండి ధర మళ్లీ రూ.71,970 కి చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరులాంటి ప్రధాన పట్టణాల్లో సైతం వెండి రేటు ఇలాగే కొనసాగుతోంది. ఈ ధరలు అన్నింటికీ స్థానికంగా ఉండే పన్నులు, మజూరీలు, ట్యాక్సులు తోడవుతాయి. కాబట్టి వినియోగదారులు కొనుగోలు సమయం ఈ విషయాన్ని తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి.