»Credit Score How To Check Credit Score On Phonepay
Credit Score: ఫోన్‌పేలో క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడం ఎలా?
ఫోన్‌పే ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఈక్రమంలో తాజాగా క్రెడిట్ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో క్రెడిట్ స్కోర్‌తో పాటు, క్రెడిట్ హిస్టరీని కూడా ఉచితంగా తెలుసుకోవచ్చు.
Credit Score: ప్రస్తుతం చాలామంది ఫోన్‌పేను ఉపయోగిస్తున్నారు. ఫోన్‌పే కూడా యూజర్లకు అనుగుణంగా కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. అయితే ఫోన్‌పే తాజాగా క్రెడిట్ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీంట్లో క్రెడిట్ స్కోర్‌తో పాటు, క్రెడిట్ హిస్టరీని కూడా ఉచితంగా తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్‌తో క్రెడిట్ కార్డుల నిర్వహణ, బిల్లుల చెల్లింపులు, రుణ వాయిదాల చెల్లింపు వివరాలను కూడా తెలుసుకోవచ్చు. ఫోన్‌పే యాప్ ఓపెన్ చేయగానే హోమ్ పేజీలో క్రెడిట్ అనే ట్యాబ్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే క్రెడిట్ స్కోర్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని కింద చెక్ నౌ అనే బటన్ కనిపిస్తుంది. దీనిని క్లిక్ చేస్తే క్రెడిట్ స్కోర్ కనిపిస్తుంది.
ఈ స్కోర్‌ను ఎక్స్‌పీరియెన్ క్రెడిట్ బ్యూరో చూపిస్తుంది. దీంతో సరైన సమయంలో చెల్లింపులు, క్రెడిట్ వినియోగపరిమితి, క్రెడిట్ ఏజ్, క్రెడిట్ మిక్స్, రుణ ఎంక్వైరీల వంటి ఇతర సమాచారం కూడా చూసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్లో మేనేజ్ క్రెడిట్స్, రుణ ప్రొఫైల్, పేమెంట్ డ్యూస్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. వీటి ద్వారా క్రెడిట్ కార్డుల నిర్వహణ, రుణ చెల్లింపుల వంటి సమాచారాన్ని నిర్వహించుకోవచ్చు. క్రెడిట్ అనే ట్యాబ్ మీకు ఫోన్‌పేలో కనిపించకపోతే యాప్‌ను అప్డేట్ చేసుకోవాలి. ఫోన్‌పేలో లాగిన్ చేసిన ఫోన్‌నంబర్, పాన్‌తో లింక్ అయిన నెంబర్ ఒకటే అయి ఉండాలి.