• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

ఈడీ ఎదుట హాజరైన అనిల్ అంబానీ

రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ ఈడీ ఎదుట హాజరయ్యారు. అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ నకు ప్రమేయం ఉన్న రూ.40 వేల కోట్ల బ్యాంకింగ్, కార్పొరేట్ మోసం కేసులో ఈడీ ఆయనను విచారిస్తోంది. కాగా, ఇటీవల ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

February 26, 2026 / 03:21 PM IST

స్వల్పంగా తగ్గిన ధరలు

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.210 తగ్గి రూ.1,61,680కు చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గి రూ.1,48,200గా నమోదైంది. అయితే, వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా కిలో రూ.2,95,000 వద్దే స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

February 26, 2026 / 09:47 AM IST

ఫ్లాట్‌గా దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 79.59 పాయింట్లు లాభపడి 82355.66 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35.85 పాయింట్ల లాభంతో 25518.35 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.87గా ఉంది.

February 26, 2026 / 09:38 AM IST

మార్చి 1న గురుకులాల్లో ప్రవేశాలకు పరీక్ష

KDP: అంబేడ్కర్ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్లో ప్రవేశాలకు మార్చి 1న పరీక్ష నిర్వహిస్తున్నట్లు గురుకుల విద్యాలయాల సమన్వయకర్త ఉదయశ్రీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 5వ తరగతికి ఉదయం 9:30 నుంచి 11:30 గంటల వరకు, ఇంటర్ ప్రథమ సంవత్సరానికి సంబంధించి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

February 26, 2026 / 08:00 AM IST

రేపు జాబ్ మేళా.. ఎక్కడంటే?

కడప YVUలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ ప్రొ.టి.శ్రీనివాస్ తెలిపారు. AP నైపుణ్యాభివృద్ధి సంస్థ, YVU ప్లేస్మెంట్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ ఎంపికలు నిర్వహిస్తున్నామన్నారు. 13 కంపెనీలు విశ్వవిద్యాలయానికి వస్తున్నాయన్నారు. టెన్త్ నుంచి పీజీ చదివిన వారు అర్హులన్నారు. పూర్తి సమాచారం కోసం 6300125455, 94405 16153 నంబర్లలో సంప్రదించాలన్నారు.

February 26, 2026 / 06:20 AM IST

ఆదోని డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకం

KRNL: ఆదోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న తెలుగు, ఎకనామిక్స్, కంప్యూటర్ అప్లికేషన్ పోస్టులకు అతిథి అధ్యాపకుల నియామకం చేపట్టనున్నట్లు ప్రిన్సిపాల్ S.శివారెడ్డి తెలిపారు. PGలో 55% మార్కులు ఉన్నవారు అర్హులని, నెట్, సెట్, PHD ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 27 నుంచి కళాశాలలో డెమో ఇవ్వాలన్నారు.

February 26, 2026 / 05:52 AM IST

ఉద్యోగ మేళాలో 69 మంది ఎంపిక

నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళాలో 69 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ శశికళ బుధవారం తెలిపారు. మొత్తం 132 మంది అభ్యర్థులు హాజరయ్యారని ప్రిసిపల్ పేర్కొన్నారు. ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని ఆమె సూచించారు.

February 26, 2026 / 05:10 AM IST

ఇంటర్ పరీక్షలు.. 96.90 శాతం హాజరు

TG: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఫస్టియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 1 పరీక్ష నిర్వహించారు. తొలి రోజు పరీక్షకు 96.90 శాతం హాజరు నమోదైనట్లుగా ఇంటర్ బోర్డు తెలిపింది. పరీక్షకు మొత్తం 5,14,598 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 4,98,695 హాజరయ్యారని, 15,903 మంది గైర్హాజరైనట్లుగా పేర్కొంది.

February 25, 2026 / 09:10 PM IST

నో రిటర్న్ బోర్డులు పెడితే శిక్ష తప్పదు!

దుకాణాల్లో ఏదైనా వస్తువు కొనుగోలు చేసిన తర్వాత కొన్నిసార్లు రిటర్న్ చేయాలని అనుకున్నప్పుడు దూకాణదారులు తిరిగి తీసుకోరు. అయితే, అది ఎలాగైతే ఉందో అదే స్థితిలో ఉంటే తిరిగి తీసుకోవడానికి వ్యాపారి నిరాకరించకూడదని వినియోగదారుల చట్టం చెబుతోంది. బిల్లులపై నో రిటర్న్ అని రాయడం 1999 నుంచి నిషేధించబడింది. వస్తువును వెనక్కి తీసుకోకపోతే సదరు దుకాణదారుడికి జరిమానా కూడా విధిస్తారు.

February 25, 2026 / 09:00 PM IST

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్ తప్పనిసరి: విద్యాశాఖ

TG: విద్యార్థుల ఆధార్ అప్‌డేషన్‌పై విద్యాశాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఏప్రిల్ 2026 నాటికి 100 శాతం ఆధార్ నమోదు పూర్తి చేయాలని నిర్ణయించింది. పాఠశాలల్లోనే ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్‌డేషన్ సదుపాయం కల్పించనుంది. 5 ఏళ్లు నిండినవారికి 15 ఏళ్లు పూర్తయిన విద్యార్థులు తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

February 25, 2026 / 08:46 PM IST

ఏఐకి టీసీఎస్‌ భయపడదు: సీఈవో కృతివాసన్‌

ఏఐకి టీసీఎస్ భయపడదని ఆ సంస్థ సీఈవో కృతివాసన్ పేర్కొన్నారు. కంపెనీ వార్షిక ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ఏఐ మార్పులకు అనుగుణంగా తమ కంపెనీ విధానాలు మార్చుకుంటున్నామని తెలిపారు. అంతేగానీ.. కొత్త టెక్నాలజీ చూసి భయపడబోమని అన్నారు. ఏఐ టూల్స్‌ను వినియోగించి పనిని వేగంగా, తక్కువ ఖర్చుతో చేసే విధానంపై తమ ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నట్లు కృతివాసన్ వెల్లడించారు.

February 25, 2026 / 08:38 PM IST

విద్యార్థులకు బిగ్ అలర్ట్

మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షల విభాగం కీలక సూచనలు చేసింది. నామినల్స్ రోల్స్‌లో విద్యార్థుల పేరు, పుట్టిన తేదీ వంటి వివరాల్లో తప్పులు ఉంటే సరిదిద్దుకోవచ్చని తెలిపింది. ఈనెల 26 నుంచి 28 వరకు అవకాశం కల్పించింది.

February 25, 2026 / 08:12 PM IST

ఏఐ సంచలనం ‘ఆంథ్రోపిక్’ విలువ ఎంతో తెలుసా?

టెక్ రంగంలో ‘ఆంథ్రోపిక్‌’ సంచలనాలు సృష్టిస్తోంది. కొత్త ఏఐ మోడళ్లతో కంపెనీలను ఆకర్షిస్తోంది. దీంతో ఆ సంస్థ మార్కెట్ విలువ 380 బిలియన్ డాలర్లకు చేరింది. మరోవైపు మార్కెట్లోకి ఆంథ్రోపిక్ కొత్త ఐటీ మోడళ్లను తెస్తుండటంతో ఇతర ఐటీ కంపెనీలు, సైబర్ సెక్యూరిటీ సంస్థల షేర్లు నష్టాలకు గురవతున్నాయి.

February 25, 2026 / 08:05 PM IST

ఫోన్‌లో సిమ్ ఉంటేనే వాట్సాప్..!

భారత యూజర్ల కోసం వాట్సాప్ సిమ్ వెరిఫికేషన్‌ను తెస్తోంది. దీంతో సైబర్ నేరాలకు చెక్ పెట్టనుంది. ఇప్పటివరకు ఫోన్‌లో సంబంధిత అకౌంట్ సిమ్ లేకపోయినా వేరే డివైజ్‌లో ఆ ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీతో వాట్సాప్‌లో లాగిన్ కావొచ్చు. దీంతో వేరే వ్యక్తులు వాట్సాప్ వాడుకునే అవకాశం ఉంది. కొత్త వెరిఫికేషన్‌తో సిమ్ ఫోన్‌లో ఉంటేనే లాగిన్ అవకాశం ఉంటుంది.

February 25, 2026 / 06:23 PM IST

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 50.15 పాయింట్లు లాభపడి 82276.07 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 57.85 పాయింట్ల లాభంతో 25482.50 దగ్గర ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.95గా ఉంది.

February 25, 2026 / 03:36 PM IST