PLD: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ సమస్యను పారద్రోలేందుకు గుర్తింపు పొందిన కంపెనీలలో ఉద్యోగాల కల్పించినట్లు సత్తెనపల్లి MLA కన్నా లక్ష్మి నారాయణ తెలిపారు. ఆదివారం పట్నంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. నియోజకవర్గం నుంచి నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి కేటాయించిన కేటగిరీల వారిగా ఇంటర్వ్యూలు చేశారు.
KNR: KU దూర విద్యా కేంద్రంలో డిగ్రీ, పీజీ చేయడానికి SEP-30 దరఖాస్తులకు అవకాశం ఉందని సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ రామ చంద్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్, డిగ్రీ పాసైన వారికి అవకాశం ఉందన్నారు. దూర ప్రాంతాల వారు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు 83413850 00 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
TG: హైదరాబాద్‌లోని CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్‌ను CSIR-IICT వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని సంబంధిత సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. వివరాలకు https://www.iict.res.inను సంప్రదించ...
AP: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షల (టెట్-2024) నిర్వహణకు సంబంధించి హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలకు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TG: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 842 యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 421 మేల్, 421 పోస్టులు ఫీమేల్ అభ్యర్థులతో కాంట్రాక్ట్ బేసిక్‌లో భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపింది. వివరాలకు https://ayush.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించారు.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,930గా ఉంది. కిలో వెండి ధర రూ.98,000గా ఉంది.
కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ లిమిటెడ్ ఎడిషన్ కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.5.65 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. వ్యాగన్ఆర్ కారు LXI, VXI, ZXI వేరియంట్లలో పెట్రోల్, CNT ఆప్షన్లలో లభిస్తుంది. 1999లో ఆవిష్కరించినప్పటి నుంచి 32.50 లక్షల యూనిట్ల వ్యాగన్ఆర్ కార్లు అమ్ముడు పోయాయి. మిడ్ సైజ్ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ కార్ల విక్రయాల్లో వ్యాగన్ఆర్ కార్లద...
భారత మార్కెట్‌లోకి ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో V40e ఫోన్‌ను ఈనెల 25న మధ్యాహ్నం 12 గంటలకు ఆవిష్కరించనుంది. వివో వీ40, వీ40 ప్రో ఫోన్లతో వివో వీ40ఈ ఫోన్ జత కలుస్తుంది. రెండు కలర్ల ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. 80 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.
CTR: ప్రైవేటు నర్సింగ్ స్కూల్‌లో జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ప్రభావతిదేవి తెలిపారు. ఇంటర్‌లో సైన్స్ గ్రూప్‌లో పాస్ అయిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. రూ.500 డీడీతో దరఖాస్తులను ఈ నెల 29వ తేదీ లోపు చిత్తూరులోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు.
అమెరికాలో శాశ్వత నివాసం పొందుతున్న గ్రీన్ కార్డుదారులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్డుల వ్యాలిడిటీ కాలాన్ని మరింత పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో గ్రీన్ కార్డు గడువు తీరినప్పటికీ.. మరో 24 నెలల పాటు దాని వ్యాలిడిటీ పొడిగించేవారు. ఇప్పుడు దీన్ని 36 నెలలకు పెంచినట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ వెల్లడించింది. దీంతో గ్రీన్ కార్డు రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఊరట లభించి...
HYD: నారాయణగూడ BJR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి గెస్ట్ లెక్చరర్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కెప్టెన్ డా.విజయ్‌కుమార్ తెలిపారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్స్, బొటని, పబ్లిక్ ఫిజిక్స్ అడ్మినిస్ట్రేషన్‌లో ఖాళీలు ఉన్నాయన్నారు. 55% మార్కులతో PG డిగ్రీ, సంబంధిత సబ్జెక్టులో PHD ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈనెల 24వ తేదీలోపు కళాశాలలో దరఖ...
2030-31 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని ఎస్ అండ్ పీ గ్లోబల్ అనే సంస్థ తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి 8.2 శాతంగా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. ఆర్థిక వేగాన్ని కొనసాగించడంలో కొనసాగుతున్న సంస్కరణల ప్రాముఖ్యతను సంస్థ తెలిపింది. వ్యాపార లావాదేవీలను, లాజిస్టిక్‌లను మెరుగుపరచడం, ప్రభుత్వ మూలధనంపై ఆధారపడటాన్ని తగ్గించాలని సంస్కరణలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
KNR: చొప్పదండి మండలంలోని నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాలకు ఈనెల 23 వరకు అవకాశం ఉందని ఆ విద్యాలయ ప్రిన్సిపల్ మంగతాయారు శనివారం తెలిపారు. సీబీఎస్ఈ విధానంలో ఆరవ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
చిన్న పెట్టుబడి పథకాలను ఆకర్షించేందుకు LIC కృషి చేస్తోంది. త్వరలోనే రోజుకు రూ.100 సిప్‌లో పొదుపు చేసే వీలు కల్పించనుంది. అలాగే నెలవారీ సిప్‌ను రూ.1,000 నుంచి రూ.200కు కూడా తగ్గించనుంది. ఈ మార్పులు అక్టోబరు 7లోపు తీసుకురానుంది. చిన్న వ్యాపారులు స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఇది వీలు కల్పిస్తుందని భావిస్తోంది. కాగా నెలకు రూ.250తో సిప్ అందుబాటులోకి తెచ్చే ఆలోచన ఉన్నట్లు...
ఈరోజు ఉదయం ఆగస్టు 5న భారత స్టాక్ మార్కెట్ కనీవినీ ఎరుగని విధంగా తీవ్రంగా కుప్పకూలింది. ఈ రోజు బీఎస్‌ఈ సెన్సెక్స్ 800 పాయింట్ల పైగా పడిపోయి, 60,000 పాయింట్ల దిగువకు చేరింది. నిఫ్టీ కూడా 250 పాయింట్ల క్షీణతను నమోదు చేసింది, 17,800 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ క్రాష్ కారణాలు అనేకం ఉన్నాయి. మొదటిగా, అంతర్జాతీయ మార్కెట్లలోని అస్థిరత, ప్రత్యేకంగా అమెరికా మార్కెట్ల నుంచి వచ్చిన నెగిటివ్ సూచనలు, భారత మార...