కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. బడ్జెట్ ఇన్వెస్టర్లకు సంతృప్తిని ఇచ్చింది. 2024లో లోకసభ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న పూర్తి బడ్జెట్ కాబట్టి ఎన్నో తాయిలాలు ఉంటాయనే అంచనాలతో మార్కెట్లు ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ప్రసంగం సమయంలో అంతకంతకూ పైకి చేరింది. ప్రసంగం అనంతరం సూచీలు నెమ్మదించాయి. బడ్జెట్ నేపథ్యంలో సెన్సెక్స్ ఉదయం 450 ...
మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో రానున్న సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. గత కొంతకాలంగా సినిమాలు ప్రారంభమైతే చాలు బిజినెస్ లెక్కలు ప్రారంభమవుతున్నాయి. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం పెద్ద పెద్ద సంస్థలు పోటీ పడుతున్నాయి. ఓటిటిలు స్టార్ హీరోల సినిమాలకు భారీ ఆఫర్స్ ఇస్తున్నాయి. మహేష్ బాబు… త్రివిక్రమ్ SSMB28 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం అప్పుడే బయ్యర...
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ప్రపంచ ధనవంతుల జాబితా నుంచి చోటును కోల్పోయారు. వ్యాపార దిగ్గజం అయిన అదానీ ప్రముఖ వ్యాపారవేత్త అంబానీతో పోటీపడుతున్నారు. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు అదానీ అధినేతగా ఉన్నారు. సోలార్, థర్మల్ విద్యుత్తు తయారీ, రవాణా, ఓడరేవుల నిర్వహణ వంటి వ్యాపారాలో అధానీ దూసుకుపోతున్నారు. పలు వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రపంచ ధనవంతుల జాబితాలో టాప్ 10లో అదానీ కొనసాగుతున్నారు. అయ...
గత రెండు రోజుల నుంచి నష్టాలను చవిచూస్తున్న స్టాక్ మార్కెట్లు నేడు లాభాల బాట పడ్డాయి. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 170 పాయింట్లు లాభపడి 59,500 వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ కూడా 45 పాయింట్లు పెరిగి 17,649కు చేరింది. ఐటీ, టెక్, టెలికామ్ సంస్థలు లాభాలతో మార్కెట్లను నడిపించాయి. ఇదిలా ఉండగా నేడు అదానీ గ్రూపు షేర్లు మరోసారి పతనం అయ్యాయి. గత రెండు రోజులుగా అదానీ గ్రూపు షేర్లు పతనం అవు...
అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలు తమపై చేసినవి కాదని ఏకంగా భారతదేశం మొత్తంపై చేసిన దాడిగా భారత వ్యాపార దిగ్గజం, అపర కుబేరుడు గౌతమ్ అదానీ అభివర్ణించాడు. అది తమ సంస్థపై చేసిన దాడి కాదని భారతదేశం, భారతీయ సంస్థలు, స్వాతంత్య్రం , నాణ్యత, ఆర్థిక వృద్ధిపై దాడిగా పేర్కొంది. హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టి పారేసింది. తప్పుడు ఆరోపణలని, అవాస్తవాలు, నిరాధారామైనవని పేర్కొంది. ఈ స...
భారతీయ స్టాక్ మార్కెట్లు గతవారం రెండు సెషన్లలోనే రూ.10 లక్షల కోట్ల మేర నష్టపోయాయి. ఇందుకు ప్రధాన కారణం హిండేన్ బర్గ్ రీసెర్చ్ ఇటీవల అదానీ గ్రూప్ పైన సంచలన ఆరోపణలు చేయడమే. ఈ రీసెర్చ్ సంస్థ దెబ్బతో అదానీ స్టాక్స్ కుప్పకూలాయి. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న గౌతం అదానీ ఇప్పుడు 7వ స్థానానికి పడిపోయాడు. అదానీ గ్రూప్ మార్కెట్ వ్యాల్యూ రూ. 4 లక్షల కోట్లకు పైగా క్షీణించింది. న్యూయార్క్ కేంద్రంగా ప...
అదానీ గ్రూప్ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అప్పులకుప్పలా మారిన గ్రూప్ కంపెనీల ఆర్థిక సత్తాపై అమెరికాకు చెందిన హిడెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోను మోసం చేస్తోందని ఆ అమెరికా సంస్థ ఆరోపించింది. అదానీ ఎంటర్ ప్రైజేస్ త్వరలో రూ.20,000 కోట్ల మలిదశ ఐపీవో జరగనున్న నేపథ్యంలో ఈ ఆరోపణలు గమనార్హం. ఈ రీసెర్చ్ నేపథ్యంలో ...
ఇంటర్నెట్ ప్రొటోకాల్ టెలివిజన్ (ఐపీటీవీ) సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. సిటీ మీడియాతో కలిసి ఉల్కా టీవీ పేరుతో విజయవాడలో ఇటీవల ఈ సర్వీసులను ప్రారంభించింది. త్వరలోనే ఏపీ సర్కిల్‌లోని బీఎస్‌ఎన్ఎల్ ఖాతాదారులకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవల ద్వారా వెయ్యికిపైగా టీవీ చానళ్లను వీక్షించే అవకాశం లభిస్తుంది. టీవీకి వేరుగా, బ్రాడ్‌బ్యాండ్ కోసం వేరుగా రెండు వేర్వేరు కనెక్షన్...
హైదరాబాద్ శంషాబాద్ లో అమెజాన్ ఎయిర్‌కార్గో విమానమైన ప్రైమ్ ఎయిర్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.అమెజాన్ ఎయిర్ ను ప్రారంభించడం భారతీయ ఇ-కామర్స్ పరిశ్రమలో గొప్ప లక్ష్యమని ఆయన అన్నారు. భవిష్యత్తులో అమెజాన్ చేపట్టబోయే కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో అమెజాన్ బృందాన్ని అభినందించారు. అమెజాన్ అతిపెద్ద క్యాంపస్...
బంగారం వ్యాపారంలో లలితా జ్యువెలర్స్ ధోరణి భిన్నం. ప్రజలను ఆకర్షించడంలో లలితా జ్యువెలర్స్ ఎండీ కిరణ్ కుమార్ ప్రత్యేకత చాటుతున్నారు. ‘డబ్బులు ఊరికే రావు’ అనే డైలాగ్ తో తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలకు మారుపేరైన కిరణ్ కుమార్ వ్యాపారం విజయవంతంగా సాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలో ఇతర ప్రాంతాల్లో తన స్టోర్లను పెంచుకుంటూ తన వ్యాపారాన్ని విస్తరిస్తున్నాడు. అయితే తన విజయం వెనుక ఒకరు ఉన్నారని ...
తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక విధానాలు పారిశ్రామికవేత్తలను, అగ్రశ్రేణి సంస్థలను ఆకర్షిస్తున్నాయి. దావోస్ వేదికగా పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండగా.. ప్రముఖ అంతర్జాతీయ ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ పెట్టుబడిని ప్రకటించింది. 2030 నాటికి ఏకంగా రూ.36, 300 కోట్ల పెట్టుబడులు చేయనున్నట్లు వెల్లడించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్ ఈ పెట్టుబడులు పెట్టనున్...
ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. టెక్ దిగ్గజం గూగుల్ కూడా అదే బాటలో నడుస్తోంది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ 6 శాతం మంది ఉద్యోగులపై వేటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నిర్ణయంతో 12 వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు తెలుస్తోంది. గూగుల్ గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులను ఆకర్షిస్తూ క్రోమ్ సెర్చ్ ఇంజిన్, యూట్యూబ్, ఇతర వేద...
బీఎండబ్ల్యూలో సరికొత్త కారు అందుబాటులోకి రానుంది. జర్మనీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ ఓ సరికొత్త మోడల్ ను ఆవిష్కరించింది. ఆయా పరిస్థితులను బట్టీ 240 రంగులను ఆ కారు మార్చనుంది. ఈ కారును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. Dee comes full colour 🔴⚪️🟡🟢🔵Introducing the BMW i Vision Dee with full-colour E Ink technology. The tech allows for a vibrant, individually configurable exterior with up to [&hell...
విశ్వనగరం దిశగా హైదరాబాద్ వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రపంచంలోని దిగ్గజ సంస్థలు హైదరాబాద్ లో కొలువుదీరుతున్నాయి. డేటా కేంద్రాలకు అడ్డాగా.. దేశంలోనే ఐటీకి ప్రధాన నగరంగా.. లైఫ్ సైన్సైస్, టీకాలకు కేంద్రంగా మారిన హైదరాబాద్ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతోంది. దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడులు వెల్లువగా వస్తుండగా.. ప్రముఖ సంస్థలన్నీ హైదరాబాద్ లో కార్యకలాపాలు మొదలుపెడుతున్నాయి. ఇప్పటికే ప్రఖ్యాత సంస్...
ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటు కంపెనీలు ఉద్యోగాల కోతపై ఫోకస్ పెట్టాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఒక విధమైన భయాందోళన వాతావరణం కమ్ముకుంది. దీంతో దిగ్గజ సంస్థలతో పాటు స్టార్టప్ కంపెనీలు కూడా ఉద్యోగులను ఇంటి బాట పట్టిస్తున్నాయి. ఇటీవల మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విటర్, షేర్ చాట్ వంటి సంస్థలు తమ ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించగా.. తాజాగా ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ కూడా ఉద్యోగులను సాగనంపింది. దాదాపు 400 మంది ఉద్యోగు...