»Indias First Lithium Ion Battery Center At Started In Bengaluru
Log9: దేశంలో తొలి లిథియం-అయాన్ బ్యాటరీ కేంద్రం బెంగళూరులో షూరూ
దేశంలోని మొట్టమొదటి వాణిజ్య లిథియం అయాన్ సెల్ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని బెంగళూరు(Bengaluru)లో నిన్న ప్రారంభించారు. లాగ్9 మెటీరియల్స్(Log9 Materials) బ్యాటరీ-టెక్నాలజీ స్టార్టప్ ఈ మేరకు మొదలుపెట్టింది.
బెంగళూరు(Bengaluru)కు చెందిన లాగ్9 మెటీరియల్స్(log9 materials) అధునాతన బ్యాటరీ టెక్నాలజీ, డీప్-టెక్నాలజీ స్టార్టప్. ఈ క్రమంలో ఇండియాలోనే మొట్టమొదటి వాణిజ్య లిథియం-అయాన్ (లి-అయాన్) సెల్ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని జక్కూర్‌లోని క్యాంపస్‌లో శుక్రవారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీలను ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. Log9 వాణిజ్య Li-ion సెల్ తయారీ కేంద్రం తొలుత 50 MWh ప్రారంభ సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు.
ఈ రోజు వరకు లాగ్ దాదాపు 3,000 బ్యాటరీలను Evsలో ఉపయోగించామని Log9 మెటీరియల్స్ సహ వ్యవస్థాపకుడు & CEO అక్షయ్ సింఘాల్ తెలిపారు. ఇవి దాదాపు 5.5 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించాయని చెప్పారు. ఈ క్రమంలో లాగ్ ఢిల్లీ, బెంగళూరు, చెన్నైతో సహా దేశవ్యాప్తంగా 20 కంటే ఎక్కువ నగరాల్లో విస్తరించినట్లు తెలిపారు. దేశంలోని వాతావరణం, కస్టమర్లకు సరిపోయేలా ఎలక్ట్రిక్ మొబిలిటీ విజన్‌ని సాకారం చేయడంలో తాము సహాయం చేస్తున్నట్లు చెప్పారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఈ డీప్ టెక్ గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Log9 రాపిడ్‌ఎక్స్ శ్రేణి EV బ్యాటరీలతో కూడిన విస్తృతమైన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. వీటిలో వాణిజ్య ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం RapidX 2000, త్రీ-వీలర్ల కోసం RapidX 6000, 8000. నాలుగు చక్రాల వాహనాల కోసం RapidX 12000, 15000 శ్రేణిలో ఉన్నాయి. ఈ లిథియం-టైటనేట్ ఆక్సైడ్ బ్యాటరీలు ఉష్ణమండల వాతావరణ పరిస్థితుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.