»Car Owner Not Wearing Helmet Challan Notice To Pay Fine Uttar Pradesh Hamirpur
Car owner not wearing helmet: కారు ఓనర్‌కు హెల్మెట్ పెట్టుకోలేదు.. ఫైన్ కట్టాలని నోటీస్
యూపీ(uttar pradesh)లోని హమీర్పూర్(hamirpur) జిల్లాలో ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. కారులో వెళ్తున్న వ్యక్తికి హెల్మెట్ ధరించలేదని పోలీసులు వెయ్యి రూపాయల చలాన్ నోటీస్ పంపించారు. అంతేకాదు ఆ తర్వాత అతను ఫైన్ కూడా కట్టినట్లు తెలుస్తోంది. ఇది తెలిసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మీరు కారులో వెళ్తున్నారా? అయితే తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోండి. లేదంటే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించే అవకాశం ఉంది. అదేంటీ కారులో కూడా హెల్మెట్ పెట్టుకుంటారా అంటే. అవును ఇలాంటి విచిత్ర సంఘటన ఇటీవల ఉత్తర్ ప్రదేశ్(uttar pradesh) రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.
ఏప్రిల్ 18న పవన్ కుమార్ డ్రైవర్ వార్తాపత్రికలు సరఫరా చేసి రాత్ టౌన్ నుంచి వస్తుండగా మస్కరా పోలీస్ స్టేషన్లో ఓ పోలీసు వాహనాన్ని ఆపి కారును ఫోటో తీసి రూ.1000 చలాన్ వేశారు. అసలు ఎందుకు చలాన్ వేస్తున్నారని డ్రైవర్ ప్రశ్నించగా.. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్నందుకు ఫైన్ వేశామని పోలీసులు చెప్పారు. అంతేకాదు యజమాని పవన్‌కుమార్ మొబైల్‌కు మెసేజ్ కూడా రావడంతో అతను అవాక్కయ్యాడు.
దీంతో ఈ అంశాన్ని పవన్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఫిర్యాదు చేయడంతో ఇన్స్పెక్టర్ నంద్ కిషోర్ తన వాహనాన్ని సీజ్ చేస్తానని బెదిరిస్తున్నాడని పవన్ కుమార్ తెలిపారు. ఈ భయాందోళన నేపథ్యంలో అతను హెల్మెట్ ధరించి కారు నడుపుతున్నాడు.
మరోవైపు పోలీసుల ఈ వింత విన్యాసాన్ని జిల్లా ఎస్పీ దీక్షాశర్మతో చర్చించగా.. ఈ చలాన్లు ఆన్లైన్లో జరుగుతాయని ఇందులో చాలాసార్లు పొరపాట్లు జరిగాయని గుర్తు చేశారు. అయితే అతని చలాన్ కూడా రద్దు చేస్తామని ఆయన చెప్పారు. కానీ అప్పటికే అతను ఫైన్ కూడా చెల్లించడం విశేషం.