»Ambanis Daughter In Law Has The Worlds Most Expensive Diamond Necklace Will You Be Shocked If You Ask The Price
Ambanis daughter in law: అంబానీ కోడలు ధరించిన నక్లెస్ ఎన్ని కోట్లో తెలుసా?
అంబానీ(mukesh ambani) కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన దేశంలోనే అత్యంత ధనవంతుల కుటుంబం. ఇక వారి విలాసవంతమైన జీవనశైలి గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా గుర్తింపు పొందిన ఈ నెక్లెస్ అంబానీ కోడలు శ్లోకా మెహతా వద్ద ఉన్నట్లు సమాచారం. ఈ ధరకు ఐదు వందల లగ్జరీ బంగ్లాలు కొన్నట్లే.
ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన ముఖేష్ అంబానీ(mukesh ambani) గురించి ఎవరికి తెలియదు? అంబానీ కుటుంబం విలాసవంతమైన జీవనశైలి తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ, కొడుకు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా లగ్జరీ కార్లు, డ్రెస్సులు, బ్యాగుల గురించి చాలా సార్లు వార్తల్లో నిలిచారు.
అలాగే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెక్లెస్ అంబానీ కోడలు దగ్గరే ఉందంటూ ఓ ఆసక్తికరమైన ఐడియా బయటకు వచ్చింది. ముఖేష్ అంబానీ , నీతా అంబానీ, కుమారుడు ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డైమండ్ నెక్లెస్(world’s most expensive diamond necklace)ను కలిగి ఉన్నారు.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా గుర్తింపు పొందిన ఈ నెక్లెస్ ధర కేవలం రెండు, మూడు కోట్లు కాదు. మొత్తం రూ.450 కోట్లు. కోడలు శ్లోకా మెహతాకు కోడలు నీతా అంబానీ(Nita Ambani) ఈ నెక్లెస్ను బహుమతిగా ఇవ్వడం గమనార్హం.
దేశంలోని నంబర్ వన్ ధనవంతుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ(mukesh ambani), నీతా అంబానీ(Nita Ambani) పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ వివాహం శ్లోకా మెహతాతో మార్చి 9, 2019న జరిగింది. శ్లోకా మెహతా దేశంలోని ప్రముఖ వజ్రాల వ్యాపారి రాసెల్ మెహతా కుమార్తె. అంబానీ, మెహతా కుటుంబానికి గతంలో వ్యాపార సంబంధాలు ఉన్నాయి.
ఆకాష్ అంబానీలాగా శ్లోకా విదేశాల్లో చదువుకోలేదు. ఆమె సామాజిక సేవకు కూడా ప్రసిద్ధి చెందాడు. శ్లోకా తన విద్యను ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి ప్రారంభించారు. ఆకాష్ అంబానీ కూడా అక్కడే చదువుకున్నాడు. అక్కడి నుంచే వీరికి పరిచయం ఏర్పడింది. తర్వాత ప్రేమగా మరింది. తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు.