దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం పెద్ద ఎత్తున నష్టాలతో చవిచూశాయి. BSE సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లకుపైగా నష్టపోగా, ఎన్ఎస్ఈ(NSE) నిప్టీ 273, బ్యాంక్ నిఫ్టీ 700 పాయింట్లకుపైగా దిగువకు పయనించాయి. దీంతో ఒక్కరోజే సమారు 3.5 లక్షల కోట్ల సంపదను మదుపర్లు కోల్పోయారు.
భారత ఐటీ దిగ్గజం విప్రో (Wipro) తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కొత్త వారికి (fresh recruiters) వార్షిక వేతనం రూ.6.5 లక్షలు ఆఫర్ చేసిన ఈ సాఫ్టువేర్ దిగ్గజం... ఆ తర్వాత దానిని దాదాపు సగానికి కోత విధించాలని నిర్ణయించుకుంది.
భారత మార్కెట్లోకి 10 వేల రూపాయాల్లోపే అద్భుతమైన ఫోన్ అందుబాటులోకి వచ్చింది. POCO C55 స్మార్ట్‌ఫోన్ రూ. 9,499 వద్ద ప్రారంభమైంది. 50MP డ్యూయల్ కెమెరా, 5,000mAh బ్యాటరీ, MediaTek Helio G85 చిప్సెట్ వంటి మంచి ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది.
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ బ్లూమ్ బర్గ్ రియల్ టైమ్ బిలియనీర్; జాబితాలో 25వ స్థానానికి పడిపోయారు. సోమవారం నాటికి అతని నికర సంపద 49.1 బిలియన్ డాలర్లు గా ఉంది.
పెట్టుబడుల ప్రకటన మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది భిన్నంగా స్పందించారు. ‘తెలంగాణలో ఉన్న సంస్థలు తమ కార్యకలాపాలు విస్తరిస్తుండడం.. కొత్త పెట్టుబడులు రావడం జరుగుతుంటే పక్క రాష్ట్రంలో మాత్రం ఉన్న సంస్థలు మూతపడుతున్నాయి.. కొత్త సంస్థలు రావడం లేదు’ అని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ గుడ్డు చుట్టూ తిరు...
సామాజిక మాధ్యమాలు ఇలా వసూళ్ల దందాకు తెరలేపాయి. ప్రజలను సామాజిక మాధ్యమాలను వినియోగించుకునేలా అలవాటు చేసిన సంస్థలు ఇప్పుడు అదే ప్రజలను పీల్చుకు తినేలా చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా లేనిది ప్రజలు ఉండలేకపోతున్నారు. సోషల్ మీడియా మాయలో పడి తమ జీవనశైలినే ప్రజలు మార్చుకున్నారు. గంటల కొద్దీ సామాజిక మాధ్యమాల్లో ఉంటూ వృత్తి, వ్యక్తిగత పనులపై శ్రద్ధ కనబర్చలేకపోతున్నారు. ఒక వ్యసనంలా సోషల్ మీడియా విని...
పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో ద్రవ్యోల్బణం(inflation) క్రమంగా పెరుగుతోంది. దీంతో నిత్యావసరాల ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో చికెన్ 700 రూపాయలు దాటగా, లీటర్ పాలు రూ.200కు చేరాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ ఇప్పటికే దివాళా తీసిందని దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ఖర్చులను తగ్గించుకునేందుకు రెండు గోల్ఫ్ క్లబ్‌లను విక్రయించనున్నట్లు చెప్పారు.
ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్, తమిళనాడు ప్రభుత్వం మధ్య శనివారం తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్, ఓలా సిఇఒ భవిష్ అగర్వాల్ సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీ కోసం తమిళనాడులో 920 మిలియన్ డాలర్లు (రూ. 7,614 కోట్లు) ఓలా పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది.
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో ( hero)మోటోకార్ప్' (MotoCorp) తాజాగా జూమ్ హైటెక్ స్కూటర్ ను తెలంగాణ (Telangana) లో విడుదల చేసింది.ఇది 110 సీసీ స్కూటర్. మరే స్కూటర్ కు లేని విధంగా దీంట్లో తొలిసారిగా కార్నర్ బెండింగ్ లైట్స్ అమర్చారు.
లేఆఫ్‌ల బాటలో తాజాగా ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ కూడా చేరింది. ఈ క్రమంలో దేశంలోని గూగుల్ సంస్థలో పనిచేస్తున్న 453 మందిని గురువారం అర్థరాత్రి నుంచి తొలగించినట్లు తెలిసింది. తొలగించబడిన Google ఉద్యోగులకు అధికారిక మెయిల్లో CEO సుందర్ పిచాయ్ నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం పెద్ద ఎత్తున నష్టాలతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న ప్రతికూల ధోరణుల దృష్యా దేశీయ మార్కెట్లు కూడా దిగువకు పయనిస్తున్నాయి. దీంతో ఒక దశలో బీఎస్ఈ(BSE) సెన్సెక్స్ 400, ఎన్ఎస్ఈ(NSE) నిప్టీ 120కిపైగా, బ్యాంక్ నిఫ్టీ 710 పాయింట్లు కోల్పోయాయి.
ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) అధిక రిటర్న్స్ అందించే సరికొత్త ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ (Investment Scheme) అమృత్ కలష్ డిపాజిట్ పథకాన్ని (Amrit Kalash Deposit) లాంచ్ చేసింది.
వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ (YouTube)కు ఇండియన్ అమెరికన్ నీల్ మోహన్ (Neal Mohan) సీఈవోగా నియమించబడ్డారు. ఈ సోషల్ మీడియా దిగ్గజానికి సూసన్ వొజిసికి (Susan Wojcicki) సుదీర్ఘకాలం అంటే తొమ్మిదేళ్ల పాటు సీఈవోగా పని చేశారు. ఇప్పుడు ఆమె వైదొలగడంతో నీల్ మోహన్‌ను నియమించింది.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్‌ను(ITR Returns) ఏప్రిల్ 1వ తేదీ నుండి సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (Central Board of Direct Taxes-CBDT) తెలిపింది.