అదానీ గ్రూప్ సంస్థపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ సంస్థపై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్, సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పూరీ బుచ్‌లకు రెండు వేర్వేరుగా లేఖలు రాస్తూ డిమాండ్ చేశారు.
ప్రముఖ ఫుడ్ డెలివరీ(Food delivery App) టెక్ కంపెనీ అయిన జొమాటో(Zomato) షాకింగ్ విషయం చెప్పింది. తమ సంస్థ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నట్లు జొమాటో(Zomato) తెలిపింది. ఈ నష్టాల వల్ల దేశంలోని 225 చిన్న నగరాల్లో తన సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.
మూడీస్ మరో షాక్ ఇచ్చింది.. అదానీకి. ఈ గ్రూప్ లోని నాలుగు కంపెనీలకు నెగెటివ్ రేటింగ్ ఇచ్చింది.
అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీ రెస్త్రిక్టెడ్ గ్రూప్ 1, అదానీ ట్రాన్స్ మిషన్ స్టెప్ వన్, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్.. ఈ నాలుగు కంపెనీల రేటింగ్ ను స్థిరత్వం నుండి నెగెటివ్ కు మార్చింది
దేశంలోనే అత్యంత ఖరీదైన పెంట్ హౌస్ ను ముంబయి వర్లీలోని త్రీ సిక్స్టీ వెస్ట్‌లో వ్యాపార వేత్త వెల్స్పన్ గ్రూప్ అధినేత B K గోయెంకా 240 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు
పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్… నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ భాగస్వామ్యంతో యూపీఐ ఆధారిత రూపే క్రెడిట్ కార్డును విడుదల చేసింది. కార్డు వెంట తీసుకు రావాల్సిన అవసరం లేకుండా క్యూఆర్ కోడ్, యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చునని తెలిపింది. యూపీఐ ఐడీకి రూపే క్రెడిట్ కార్డును లింక్ చేసుకుంటే సరిపోతుందని వెల్లడించింది. రూపే క్రెడిట్ కార్డుతో యూపీఐపై చెల్లింపుల సౌలభ్యం ఉంటుందని తెలిపింది. రూపే క్ర...
ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఆర్థిక నిపుణులు ముందుగా ఊహించినట్లుగానే వడ్డీ రేట్ల పెంపుదలకే గవర్నర్ మొగ్గు చూపారు. ఈ క్రమంలో ఆరోసారి రెపోరేటు 25 బేసిస్ పాయింట్ల మేర పెంచారు. దీంతో రేపో రేటు 6.50కు చేరుకుంది. చివరిగా గత ఏడాది డిసెంబర్లో ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరుగగా ఆ సమయంలో 35 బేసిస్ పాయింట్లు పెంచారు. ద్రవ్యోల్బణం కట్టడి...
ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. గూగుల్ నుంచి మొదలుకొని చిన్న కంపెనీల వరకు కాస్ట్ కటింగ్ బాట పట్టాయి. ఆర్థిక మాంద్యం, మార్కెట్ ప్రభావం నేపథ్యంలో తొలగిస్తున్నాయి. రోజు ఓ కంపెనీ తమ ఉద్యోగులను తొలగించి ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. తాజాగా అమెరికన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కంపెనీ జూమ్ కాస్ట్ కట్ చేసింది. తమ కంపెనీలో 15 శాతం ఉద్యోగులను తొలగించింది. మొత్తం 1,300 మంది ఉద్యోగులను ఇ...
కోవిషీల్డ్ టీకా(covishield vaccine) తీసుకున్న వారికి హార్ట్ ఎటాక్(heart attack) వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ప్రముఖ ప్రముఖ బ్రిటిష్-ఇండియన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అసీమ్ మల్హోత్రా(aseem malhotra) తెలిపారు. బ్రిటన్లో ఈ టీకా వేసుకున్న వారిలో దాదాపు 10 శాతం మందికి ఇదే పరిస్థితి తలెత్తినట్లు చెప్పారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండెపోటుతోపాటు పక్షవాతం, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు చిన్న,...
ఇప్పుడు అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్.. పెద్ద నోట్లు రద్దు తర్వాత దేశంలో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయి. యూపీఐ ద్వారా టీ స్టాల్, టిఫిన్ సెంటర్, చికెన్ సెంటర్.. ఒక్కటేమిటి అన్నీ చోట్ల స్కాన్ చేసి చెల్లింపులు చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల్లో ఫోన్ పేను ఎక్కువ ఉపయోగిస్తున్నారు. తన సేవలను ఫోన్ పే మరింత విస్తరించింది. విదేశాల్లో కూడా అందుబాటులోకి తీసుకొంది. యూఏఈ, సింగపూర్, మారిషస్, నేపాల్, భూట...
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద సిటీ అయిన వరంగల్లో ఐటీ కంపెనీలు క్రమంగా పెరుగుతున్నాయి. ఓరుగల్లులో ఇప్పటికే మూడుకుపైగా ప్రముఖ ఐటీ కంపెనీలు తమ సంస్థలను ఏర్పాటు చేశాయి. తాజాగా మరో సంస్థ అయిన ఎల్టీఐ మైం డ్ ట్రీ(LTI mindtree) ఈ నెలాఖరు నాటికి తమ డెలివరీ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలో హైదరాబాద్లో మంత్రి ...
హిండెన్ బర్గ్ వ్యవహారం నేపథ్యంలో అదానీ గ్రూప్ కకావికలమవుతోంది. ఈ కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి. ఈ వారం పది రోజుల్లోనే షేర్లు మూడింతలు నష్టపోయాయి. దీంతో గౌతమ్ అదానీ సంపద లక్షల కోట్లు కరిగిపోయింది. ఈ వ్యవహారం పార్లమెంటును కూడా కుదిపేస్తోంది. అదే సమయంలో హిండెన్ బర్గ్ విశ్వసనీయత పైన కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ రేటింగ్ ఏజెన్సీలు మరో విషయాన్ని వెల్లడించాయి. అదానీ గ్రూప్‌కు రుణాల...
కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా…. ఈ బడ్జెట్ లో ఏపీకి రావాల్సిన పెండింగ్ బకాయిలను అందిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి పంపవలసిన రూ. 689 కోట్ల రూపాయల నిధులు పెడింగ్‌లో ఉన్నాయని, ఆ సొమ్మును పరిహార నిధి నుంచి త్వరలోనే చెల్లిస్తామని కేంద్ర నిర్మలా సీతారామన్ హమీ ఇచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిల చెల్ల...
రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రైల్వే ప్రయాణికులు తమ వాట్సాప్ నంబర్ ద్వారా తమకు ఇష్టమైన, రుచికరమైన భోజనాన్ని ఆర్డర్ పెట్టొచ్చు. ఇంటరాక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఎనేబుల్డ్ చాట్‌బోట్‌ను ఇందుకోసం రైల్వే అందుబాటులోకి తెస్తోంది. ఈ చాట్‌బోట్‌పై ప్రయాణికులు ఈ-కేటరింగ్, మీల్స్ బుకింగ్ కోసం చాటింగ్ చేసి తమకు నచ్చిన ఆహారాన్ని...
టెక్ కంపెనీల్లో భారీగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ జరుగుతోంది. కంపెనీలు తమ ఖర్చులు తగ్గించుకునేందుకు వేల సంఖ్యల్లో ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. ప్రముఖ టెక్ కంపెనీలు అయిన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, బైజూస్, పేపాల్, స్పాటిఫై వంటి సంస్థలు ఇప్పటికే తమ సంస్థల్లోని ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. తాజాగా ఈ జాబితాలోకి కంప్యూటర్ల తయారీ దిగ్గజం డెల్ కూడా చేరిపోయింది. తమ సంస్థలో 6500 మంది ఉద్యో...
హిండేన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తర్వాత అదానీ షేర్లు భారీగా కుప్పకూలుతున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పందించారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న అదానీ గ్రూప్ వ్యవహారం ప్రభావం భారత దేశ ఆర్థిక భావ చిత్రంపై, స్థూల ఆర్థిక వ్యవస్థ మౌలికాంశాలపై ఏమాత్రం ఉండదని చెప్పారు. అదానీ గ్రూప్ పబ్లిక్ ఆఫర్ ఉపసంహరణ పైన కూడా పరోక్షంగా స్పందించారు. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫ...