ఇండియాలో నిన్నటితో పొల్చుకుంటే ఏప్రిల్ 15న పసిడి ధరలు(gold rates) రూ.700కుపైగా తగ్గాయి. దీంతోపాటు వెండి కూడా రూ.1500 తగ్గింది. ఈ నేపథ్యంలో గోల్డ్, వెండి(silver) కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదలను పాక్షికంగా భర్తీ చేసేందుకు మే 1 నుంచి తమ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచనున్నట్లు టాటా మోటార్స్ శుక్రవారం తెలిపింది. వేరియంట్, మోడల్ ఆధారంగా గరిష్ట పెరుగుదల 0.6 శాతంగా ఉంటుందని దేశీయ ఆటో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
వాట్సప్ నిత్యం ప్రజలకు అభిరుచులకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుంటూ సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. తాజాగా మరో మూడు ఫీచర్లను వాట్సప్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
మహీంద్రా & మహీంద్రా మాజీ ఛైర్మన్ కేశబ్ మహీంద్రా, బుధవారం కన్నుమూశారు. 99 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. అతను ఇటీవల విడుదల చేసిన ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్ట్ 2023లో భారతదేశంలోని 16 కొత్త బిలియనీర్లలో ఒకరిగా నిలిచారు.
భారత స్టాక్ మార్కెట్లు(indian stock market) మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్(sensex) 311 పాయింట్లు, నిఫ్టీ 98, బ్యాంక్ నిఫ్టీ సూచీ 532 పాయింట్లు పెరిగి లాభాలతో పూర్తయ్యాయి.
ప్రముఖ అమెరికన్ సంస్థ ఆపిల్ తొలిసారిగా ముంబయి(Mumbai), ఢిల్లీ(Delhi) ప్రాంతాల్లో వారి రిటైల్ ఆఫ్ లైన్ స్టోర్లను(Apple offline store) తెరిచేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 18న BKC స్టోర్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఒకటి, ఢిల్లీలోని సెలెక్ట్ సిటీవాక్ మాల్‌లో ఇంకొటి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
మార్చి నెలలో చమురు వినియోగం (India's fuel demand) భారీగా పెరిగింది. ఏడాది ప్రాతిపదికన గత మార్చి నెలలో చమురు వినియోగం 5 శాతం పెరిగి 4.83 మిలియన్ బ్యారెళ్లకు లేదా 20.5 మిలియన్ టన్నులకు పెరిగింది.
భాగ్యనగరం మరో కీలక బిజినెస్ సదస్సుకు వేదికగా మారనుంది. ఈ క్రమంలో ఏప్రిల్ 16న హైదరాబాద్(hyderabad)లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఇన్వెస్టర్ బిజినెస్ సమ్మిట్(Investor Business Summit) జరగనుంది.
Mangoes On EMI: ఇప్పటి వరకు మనం ఎలక్ర్టానిక్ వస్తువులు నెలవారీ ఈఎంఐలో తీసుకుని ఉంటాం. మహారాష్ట్రలో ఓ వ్యాపారి వినూత్నంగా మామిడి పండ్లు కూడా ఈఎంఐలో అమ్ముతానని ప్రకటించాడు. వేసవి అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది మామిడి పండ్లు. ప్రతీ ఒక్కరు మామిడి పండ్లను తినాలని చూస్తుంటారు. ఎందుకంటూ మామిడికున్న క్రేజ్ అలాంటిది పైగా అది ‘పండ్లలో రాజు’ . మామిడిలో చాలా రకాలున్నాయి. కొన్ని రకాలు వరల్డ్ ఫేమస్. ఆ కేటగిర...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకుండా 6.50 శాతం వద్ద వడ్డీ రేటును స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.