»Gold And Silver Reduced By Rs 760 And Rs1500 Respectively India On April 15th 2023
Gold and Silver: ఏకంగా రూ.760, రూ.1500 తగ్గిన బంగారం, వెండి
ఇండియాలో నిన్నటితో పొల్చుకుంటే ఏప్రిల్ 15న పసిడి ధరలు(gold rates) రూ.700కుపైగా తగ్గాయి. దీంతోపాటు వెండి కూడా రూ.1500 తగ్గింది. ఈ నేపథ్యంలో గోల్డ్, వెండి(silver) కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
భారత్‌లో ఈరోజు(ఏప్రిల్ 15న) బంగారం ధరలు పెద్ద ఎత్తున తగ్గాయి. గ్రాముకు ఏకంగా రూ.760 తగ్గింది. ఈ క్రమంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.55,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,040గా ఉంది. గత రోజు ధరలతో పోలిస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.700, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.760 తగ్గింది. మరోవైపు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బెంగళూరులో రూ.61,850, ఢిల్లీలో రూ.61,950, కోల్‌కతాలో రూ.61,800, ముంబై, పూణెలో రూ.61,800గా ఉంది.
ఇంకోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా గ్రాముకు రూ.1.50 తగ్గగా ఈ నేపథ్యంలో కేజీకీ 1500 రూపాయల చొప్పున తగ్గింది. దీంతో కిలో వెండి రూ.81, 500కు చేరింది. నిన్న కేజీ వెండి ధర రూ.83000గా ఉండేది. అక్షయ తృతీయ సీజన్‌కు ముందే దేశంలో బంగారం ధరలు జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుని మళ్లీ తగ్గడం పట్ల గోల్డ్ కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గోల్డ్ లేదా వెండిని భౌతిక రూపంలో కొనుగోలు చేయవచ్చు లేదా MCX ద్వారా కొనుగోలు చేసేందుకు పలు బ్యాంకింగ్ సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు వాటిపై కూడా ఓసారి లుక్కేయండి మరి.