»Keshub Mahindra Died At Age Of 99 He Was Indias Oldest Billionaire Know About Him
Keshub Mahindra: దేశంలోనే వృద్ధ బిలియనీర్ .. మహీంద్రా గ్రూప్ మాజీ చైర్మన్ కన్నుమూత
మహీంద్రా & మహీంద్రా మాజీ ఛైర్మన్ కేశబ్ మహీంద్రా, బుధవారం కన్నుమూశారు. 99 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. అతను ఇటీవల విడుదల చేసిన ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్ట్ 2023లో భారతదేశంలోని 16 కొత్త బిలియనీర్లలో ఒకరిగా నిలిచారు.
Keshub Mahindra:భారతదేశంలోని అత్యంత వృద్ధ బిలియనీర్ .. మహీంద్రా & మహీంద్రా మాజీ ఛైర్మన్ కేశబ్ మహీంద్రా, బుధవారం కన్నుమూశారు. 99 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. అతను ఇటీవల విడుదల చేసిన ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్ట్ 2023లో భారతదేశంలోని 16 కొత్త బిలియనీర్లలో ఒకరిగా నిలిచారు. అతను 1.2 బిలియన్ డాలర్ల నికర సంపదను కలిగి ఉన్నాడు. 48 ఏళ్ల పాటు మహీంద్రా గ్రూప్‌కు నాయకత్వం వహించిన ఆయన 2012లో చైర్మన్ పదవిని వదులుకున్నారు.
దివంగత కేశబ్ మహీంద్రా 1947లో తన తండ్రి కంపెనీలో పని చేయడం ప్రారంభించారు. దీని తర్వాత 1963లో అతను మహీంద్రా గ్రూప్‌కు ఛైర్మన్‌గా నియమించబడ్డాడు. కేశబ్ మహీంద్రా పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు మేనమామ. ఇప్పటి వరకు మహీంద్రా & మహీంద్రా (M&M)మాజీ చైర్మన్‌గా ఉన్నారు. 2012లో గ్రూప్ చైర్మన్ పదవి నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత ఆనంద్ మహీంద్రాకు ఈ బాధ్యతలు అప్పగించారు.
కేశబ్ మహీంద్రా 1923 అక్టోబర్ 9న సిమ్లాలో జన్మించారు. ఆయన మృతి పట్ల కార్పొరేట్ ప్రపంచం మొత్తం సంతాపం వ్యక్తం చేసింది. అతను 100సంవత్సరాలు పూర్తి చేసుకునే ముందు బిలియనీర్ల జాబితాలో పేరుపొందిన వ్యక్తిగా కేశబ్ వార్తల్లో నిలిచారు. కానీ కొద్ది రోజులకే అతని మరణ వార్త వినాల్సి వచ్చింది. కేశబ్ మహీంద్రా USAలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు. 1963లో మహీంద్రా గ్రూప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కంపెనీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాడు. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్(INSPACe) చైర్మన్ పవన్ గోయెంకా ట్వీట్ ద్వారా తన సంతాపాన్ని తెలియజేశారు.
<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>The industrial world has lost one of the tallest personalities today. Shri Keshub Mahindra had no match; the nicest person I had the privilege of knowing. I always looked forward to mtgs with him and inspired by how he connected business, economics and social matters. Om Shanti.</p>— Pawan K Goenka (@GoenkaPk) <a href=”https://twitter.com/GoenkaPk/status/1646012668103495681?ref_src=twsrc%5Etfw”>April 12, 2023</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>