Realme 11 Pro+:రియల్‌మి 11 ప్రొ ఫ్లస్ (Realme 11 Pro+) త్వరలో చైనాలో (china) లాంచ్ కాబోతుంది. మే 10వ తేదీన రియల్ మి 11, రియల్ మి 11 ప్రొ, రియల్ మి 11 ప్రొ ప్లస్ లాంచ్ చేస్తారు. ఈ ఫోన్ రియల్ 10 ప్రో ప్లస్‌కు అప్ డేటెడ్ అనే సంగతి తెలిసిందే. మొబైల్ ఫీచర్లను చైనా సోషల్ మీడియా యాప్ విబోలో పోస్ట్ చేశారు.
మొబైల్ చూడటానికి స్టైలిష్ లుక్‌లో (stylish look) ఉంది. 200 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉండే అవకాశం ఉంది. 6.7 ఇంచుల అమోలెడ్ డిస్ ప్లే, సెంట్రల్ పొజిషిన్డ్ హొల్ పంచ్ కటౌట్‌తో మొబైల్ వస్తోంది. కర్వ్ డిస్ ప్లే ఇచ్చారు. ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో మొబైల్ రన్ అవుతోంది. 12 జీబీ ర్యామ్‌తో వర్క్ చేస్తోంది.
మొబైల్ కెమెరా, బ్యాటరీకి సంబంధించిన సమాచారం ఇవ్వలేదు. ధర వివరాలు కూడా త్వరలో తెలియజేసే అవకాశం ఉంది. రియల్ మి (realme) ఫోన్లకు ఇండియాలో కూడా మంచి మార్కెట్ ఉంది. ధర తక్కువ కావడం.. ఎక్కువ ఫీచర్లు ఉండటంతో కొనుగోలు చేస్తున్నారు. ఆ మేరకు కొత్త కొత్త మొబైల్స్‌ను కంపెనీ ఆవిష్కరిస్తోంది.