బైజూస్(Byjus) పేరుతో ఎడ్టెక్ ప్లాట్‌ఫారమ్‌ను నడుపుతున్న ‘థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్’ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బైజూ రవీంద్రన్(Raveendran)కు చెందిన మూడు ప్రాంగణాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం సోదాలు నిర్వహించింది.
వివిధ నేరారోపణ పత్రాలు, డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకుని, విదేశీ మారక నిర్వహణ చట్టం (FEMA) నిబంధనల ప్రకారం దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది.
ఏజెన్సీ ప్రకారం కంపెనీ 2011, 2023 మధ్య రూ.28,000 కోట్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) పొందింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పేరుతో అదే కాలంలో వివిధ విదేశీ వ్యవహారాల కోసం సుమారు రూ.9,754 కోట్లను పంపింది.
ఏజెన్సీ ప్రకారం ఈ కంపెనీ 2011, 2023 మధ్య రూ.28,000 కోట్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) పొందింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పేరుతో అదే కాలంలో వివిధ విదేశీ వ్యవహారాల కోసం సుమారు రూ.9,754 కోట్లను పంపింది. ఈ క్రమంలో ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది.
ఈ నేపథ్యంలో కంపెనీ గణాంకాల వాస్తవికతను బ్యాంకుల నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నట్లు ఏజెన్సీ వెల్లడించింది. వివిధ ప్రైవేట్ వ్యక్తుల నుంచి వచ్చిన వివిధ ఫిర్యాదుల ఆధారంగా బైజూస్ ప్లాట్‌ఫారమ్‌పై విచారణ చేస్తున్నట్లు ED తెలిపింది. ఈ క్రమంలో ఈడీ నిర్వహించిన దర్యాప్తులో బైజు రవీంద్రన్‌కు అనేక సమన్లు జారీ చేయబడ్డాయని ప్రకటించారు. అతను అనేక సార్లు తప్పించుకునేవాడని, దర్యాప్తు సమయంలో ఎప్పుడూ కనిపించలేదని ఈడీ అధికారులు తెలిపారు.