మూడీస్ మరో షాక్ ఇచ్చింది.. అదానీకి. ఈ గ్రూప్ లోని నాలుగు కంపెనీలకు నెగెటివ్ రేటింగ్ ఇచ్చింది.
అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీ రెస్త్రిక్టెడ్ గ్రూప్ 1, అదానీ ట్రాన్స్ మిషన్ స్టెప్ వన్, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్.. ఈ నాలుగు కంపెనీల రేటింగ్ ను స్థిరత్వం నుండి నెగెటివ్ కు మార్చింది
హిండేన్ బర్గ్ నివేదిక అనంతరం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ఎంతలా అంటే ఏకంగా గ్రూప్ కంపెనీల షేర్లు 70 శాతం నుండి 80 శాతం వరకు పడిపోయాయి. అయితే వివిధ రేటింగ్ ఏజెన్సీలు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశాయి. వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల నుండి అదానీ కంపెనీలు తీసుకున్న రుణం తక్కువేనని, కాబట్టి ఆ బ్యాంకుల పైన ప్రభావం ఉండదని వెల్లడించాయి. ఇది నష్టనివారణను ఆపడానికి కాస్త ఉపయోగపడింది. హిండేన్ బర్గ్ రీసెర్చ్ వెలుగు చూసినప్పటి నుండి అదానీ షేర్లు దారుణంగా పడిపోయిన విషయం తెలిసిందే. రేటింగ్ ఏజెన్సీల నివేదిక అనంతరం అదానీ షేర్లు స్వల్ప లాభాల్లోకి వచ్చాయి. అయితే తాజాగా.. మూడీస్ మరో షాక్ ఇచ్చింది.. అదానీకి. ఈ గ్రూప్ లోని నాలుగు కంపెనీలకు నెగెటివ్ రేటింగ్ ఇచ్చింది.
నెగిటివ్ రేటింగ్ వీటికే
అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీ రెస్త్రిక్టెడ్ గ్రూప్ 1, అదానీ ట్రాన్స్ మిషన్ స్టెప్ వన్, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్.. ఈ నాలుగు కంపెనీల రేటింగ్ ను స్థిరత్వం నుండి నెగెటివ్ కు మార్చింది మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్. అదానీ కంపెనీల ఈక్విటీల విలువ మార్కెట్లో ఇటీవలి కాలంలోనే అత్యంత వేగంగా పతనం కావడంతో తాజా సవరణలు వచ్చాయి.
ఇవి యధాతథం
ఈ గ్రూప్ లోని నాలుగు కంపెనీల రేటింగ్ ను ప్రతికూలంగా సవరించినప్పటిని మరో ఎనిమిది కంపెనీల రేటింగ్ కు మాత్రం స్థిరత్వాన్ని కొనసాగించింది. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ ఇంటర్నేషల్ కంటైనర్ టెర్మినల్, అదానీ గ్రీన్ ఎనర్జీ రెస్త్రిక్టెడ్ గ్రూప్ 2, అదానీ ట్రాన్స్ మిషన్ రెస్త్రిక్టెడ్ గ్రూప్ 1 లు ఇందులో ఉన్నాయి.