ఇంజినీరింగ్ సేవల సంస్థ L&T టెక్నాలజీ సర్వీసెస్(LTTS) కొత్త ఉద్యోగులను తీసుకోనున్నట్లు తెలిపింది. 2024-25లో 2 వల మంది ఫ్రెషర్స్‌ని నియమించుకోనున్నట్లు చెప్పింది. ఇప్పటికే నియామకపత్రాలు అందజేస్తున్నట్లు వెల్లడించింది. ఉద్యోగులకు వేతన పెంపు ప్రక్రియను అక్టోబర్‌లో మొదలు పెట్టనున్నట్లు పేర్కొంది. కాగా.. సెప్టెంబరు త్రైమాసికంలో రూ.319.6కోట్ల నికర లాభాన్ని LTTS నమోదు చేసింది.