»Government Launched Nccfs Mobile Van For The Sale Of Onion At A Subsidized Rate From September 6
Onion Price Hike: ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 6నుంచి మొబైల్ వ్యాన్ల ద్వారా విక్రయం
Onion Price Hike: రాబోయే రోజుల్లో ఉల్లి ధర సామాన్యుడిని కంటతడి పెట్టించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఖరీదైన ఉల్లి భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నాహాలు ప్రారంభించింది.
Onion Price Hike: రాబోయే రోజుల్లో ఉల్లి ధర సామాన్యుడిని కంటతడి పెట్టించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఖరీదైన ఉల్లి భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నాహాలు ప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీతో సహా అనేక నగరాల్లో నాఫెడ్(NAFED), NCCF మొబైల్ వ్యాన్ల ద్వారా తక్కువ ధరలకు ఉల్లిపాయలను విక్రయించడానికి సిద్ధమవుతున్నాయి. వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే సూచనల మేరకు సెప్టెంబర్ 6, 2023న NCCF మొబైల్ వ్యాన్ ద్వారా ఉల్లిపాయలను రిటైల్ మార్కెట్లో కిలో రూ. 25 చొప్పున వినియోగదారులకు విక్రయిస్తారు.
ఉల్లి ధరల పెరుగుదలను అరికట్టేందుకు ప్రభుత్వం బల్క్ బఫర్ స్టాక్ నుండి 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 36,250 టన్నుల ఉల్లిని విడుదల చేసింది. హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో బఫర్ స్టాక్ నుండి విక్రయించే పని NAFED, NCCF లకు ఇవ్వబడింది. బఫర్ స్టాక్‌ను పెంచడానికి రెండు ఏజెన్సీలను రైతుల నుండి అదనంగా 3 నుండి 5 లక్షల టన్నుల ఉల్లిని కొనుగోలు చేయాలని అభ్యర్థించారు. హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో ఉల్లి బఫర్ స్టాక్‌ను విడుదల చేయడం ద్వారా ఉల్లి ధరల పెరుగుదలను నిరోధించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు. ఆగస్టు 11 నుంచి ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, చండీగఢ్, కేరళ సహా 12 రాష్ట్రాల్లో 35,250 టన్నుల ఉల్లి హోల్‌సేల్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది.
రిటైల్ మార్కెట్లో ప్రభుత్వం రాయితీ ధర రూ.25కు ఉల్లిని విక్రయిస్తోంది. బఫర్ స్టాక్ నుంచి ఉల్లి ధరలో ఎలాంటి మార్పు లేదు. రాబోయే రోజుల్లో మొబైల్ వ్యాన్ల ద్వారా మరిన్ని ఉల్లిని విక్రయించనున్నారు. సెప్టెంబర్ 4 న రిటైల్ మార్కెట్లో ఉల్లి సగటు ధర కిలోకు రూ. 33.41గా ఉంది, ఇది ఏడాది క్రితం కంటే 37 శాతం ఎక్కువ. ఏడాది క్రితం కిలో ఉల్లి ధర రూ.24.37. ఢిల్లీలో కిలో ఉల్లి ధర రూ.37 ఉండగా, కోల్‌కతాలో కిలో రూ.39గా ఉంది.