Gold Rates Today : జీవిత కాల గరిష్ఠానికి బంగారం ధర
పసిడి, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఎప్పుడో ఒక రోజు స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నా... పెరుగుదలే అధికంగా ఉంటోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ లోహాల ధరలు ఏది ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చదివేయండి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర శనివారం భారీగా పెరుగుదలను నమోదు చేసింది. జీవిత కాల గరిష్ఠానికి చేరింది. శుక్రవారం దీని ధర రూ.71,747 ఉండగా, శనివారం నాటికి ఏకంగా రూ.1,334 పెరిగి రూ.73,081కు చేరుకుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.73,081గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) శుక్రవారంరూ.81,145 ఉండగా, శనివారం నాటికి రూ.1,830 పెరిగి రూ.82,975కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ కూడా నేటి మార్కెట్ ప్రారంభ సమయానికి వెయ్యి రూపాయలకు పైనే పెరగడం గమనార్హం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర భారీగా పెరిగింది. శుక్రవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2,276 డాలర్లు ఉండగా, శనివారం నాటికి ఏకంగా 54 డాలర్లు పెరిగి 2,330 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 27.50 డాలర్లుగా ఉంది.