Gold Rates Today : రూ. 70వేల మార్కును దాటిన బంగారం ధర
ఈ వారం ప్రారంభం నుంచి బంగారం ధరలు వరుసగా పెరుగుతూనే కనిపిస్తున్నాయి. గురు, శుక్ర వారాల్లో అయితే భారీ పెరుగుదల కనిపించింది. వెండి ధర సైతం పెరుగుతూనే ఉంది. ఏ లోహం ఎంత ధర ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే.
Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చదివేయండి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర గురువారం రూ.69,920 ఉండగా, శుక్రవారం నాటికి రూ.210 పెరిగి రూ.70,130కు చేరుకుంది. దీంతో బంగారం 70 వేల మార్కును చేరడం గమనార్హం.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.70,130గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) గురువారం రూ.77,040 ఉండగా, శుక్రవారం నాటికి రూ.218 పెరిగి రూ.77,258కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు సైతం భారీగా పెరుగుతున్నాయి. గురువారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2197 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 36 డాలర్లు పెరిగి 2233 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 24.99 డాలర్లుగా ఉంది.