Five people from Amalapuram died in an American road accident
Car Accident in Jammu Kashmir : జమ్ము కశ్మీర్ రాష్ట్రం రంబాన్ జిల్లాలోని జమ్ము – శ్రీనగర్ జాతీయ రహదారిపై ఓ కారు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ప్రమాదవశాత్తూ అది 300 అడుగుల లోతున్న లోయలోకి పడిపోయింది. దీంతో సహాయక బృందాలు ఇప్పటి వరకు అక్కడి నుంచి పది మృతదేహాలను వెలికి తీశారు. ఈ తెల్లవారుజామున 1.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్పోర్స్(ఎస్డీఆర్ఎఫ్), సివిల్ క్విక్ రెస్పాన్స్టీమ్(క్యూఆర్టీ) ఘటనా స్థలానికి చేరకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జమ్ము కశ్మీర్లో ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాహనం అదుపు తప్పి లోయలోకి పడిపోయినట్లు తెలుస్తోంది.
మృతుల్లో బిహార్‌లోని పశ్చిమ చంపారన్‌కు చెందిన విపిన్ ముఖియా భైరాగాంగ్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అలాగే కారు డ్రైవర్‌ను జమ్మూలోని అంబ్ ఘ్రోథాకు చెందిన బల్వాన్ సింగ్ (47)గా గుర్తించారు. గతేడాది నవంబర్ 15న జమ్ములోని దోడా జిల్లాలో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 39 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 17 మంది గాయపడ్డారు.