»Mlc Kavitha Kavithas Complaint Against Prison Officials Because
MLC Kavitha: జైలు అధికారులపై కవిత ఫిర్యాదు.. ఎందుకంటే?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు. జైలులో ఆమెకు సౌకర్యాలు కల్పించడంలేదని ఆమె తరఫున న్యాయవాదులు జైలు అధికారులపై ఫిర్యాదు చేశారు.
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో ఉన్నారు. అయితే జైలులో ఆమెకు కొన్ని సౌకర్యాలు కల్పించాలని ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు తెలిపింది. అయితే జైలు అధికారులు తనకు వసతులు కల్పించడం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తీహార్ జైలు అధికారులపై కవిత తరపు న్యాయవాదులు రౌస్ ఎవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు. జైలు అధికారులకు న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు.
కవిత విజ్ఞప్తి మేరకు సొంతంగా భోజనం ఏర్పాటు చేసుకోవడం, రోజువారీ ఉపయోగించే దుస్తులు తీసుకోవడం, కొన్ని ఆభరణాలు ధరించడం, సొంతంగా పరుపులు ఏర్పాటు చేసుకోవడం, దుప్పట్లు తెచ్చుకోవడం, చెప్పులు ధరించడం వంటి వెసులుబాట్లను న్యాయస్థానం కల్పించింది. కవితను తీహార్ జైలుకు తరలించే ముందే ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను తీహార్ జైలు అధికారులకు అందించామని, అయినా కవితకు జైలులో ఎలాంటి వసతులు కల్పించడం లేదని ఆమె తరపు న్యాయవాది మోహిత్‌రావు కోర్టు దష్టికి తీసుకెళ్లారు.
కనీసం రోజువారీ ఉపయోగించే దుస్తులకు కూడా అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును రౌస్ ఎవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా పరిశీలించారు. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయడంలేదో ఈరోజు సమాధానం చెప్పాలని జైలు అధికారులను ఆదేశించారు.