రోజురోజుకు బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. దీంతో సామాన్యులు కొనాలంటేనే భయపడుతున్నారు. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1200 పెరిగి రూ.1,18,640కి చేరుకుంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1100 పెరిగి రూ.1,08,750గా ఉంది. కాగా, కిలో వెండి రూ.1000 తగ్గి రూ.1,60,000కి చేరింది.