RRB దేశవ్యాప్తంగా గల అన్ని రైల్వే జోన్లలో మొత్తం 368 పోస్టులతో సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. డిగ్రీ అర్హత గల అభ్యర్థులు ఈ నెల 14 వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు చెల్లింపునకు అధికారులు ఈనెల 16 వరకు అవకాశం కల్పించారు. కేవలం సింగిల్ స్టేజ్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.