Credit Card MAY Month expenditure Is Rs.1.4 Lakh Crore
Credit Card: ఏ అవసరం వచ్చినా సరే కార్డ్ వాడుతున్నారు. డెబిట్ కార్డు వాడటం తక్కువ.. క్రెడిట్ కార్డ్ (Credit Card) యూజ్ ఎక్కువ. దేశంలో మే నెలలో క్రెడిట్ కార్డు వాడటం ఎక్కువ అయ్యిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతోంది. ఒక నెలలోనే రూ.1.4 లక్షల కోట్ల వ్యయం చేశారని ఆర్బీఐ (RBI) చెబుతోంది. గత ఏడాది ఏ నెలలో కూడా క్రెడిట్ కార్డు (Credit Card) వినియోగం రూ.1.10 లక్షల కోట్ల నుంచి రూ.1.20 లక్షల కోట్లను దాటలేదు. ఈ సారి మాత్రం దాదాపు 20 వేల కోట్ల వినియోగం పెరిగింది. దేశంలో ప్రస్తుతం వినియోగంలో ఉన్న క్రెడిట్ కార్డుల (Credit Card) సంఖ్య 8.74 కోట్లకు చేరింది.
2 నెలల్లో 20 లక్షల కార్డులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 2 నెలల్లో 20 లక్షల క్రెడిట్ కార్డులు (Credit Card) జారీ చేశారని తెలిసింది. ఒక్కో కార్డుపై (CARD) యావరేజిగా రూ.16,144 లిమిట్ ఉంది. దీంతో మెజార్టీ హోల్డర్లు తన అవసరాల కోసం కార్డ్ ఉపయోగించి ఉంటారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC) రూ.181 కోట్లు, ఎస్బీఐ (SBI) 1.71 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI) 1.47 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ (AXIS) 1.25 కోట్ల కార్డులను జారీ చేశాయి. క్రెడిట్ కార్డులు (Credit Card) ఈ స్థాయిలో వినియోగం ఉన్నా.. బకాయిలు కూడా పెరుగుతున్నాయని ట్రాన్స్ యూనియన్ సిబిల్ తన నివేదికలో ప్రస్తావించింది.
పెరిగిన మొండి బకాయిలు
గత ఏడాది మార్చితో పోలిస్తే క్రెడిట్ కార్డుల (Credit Card) మొండి బకాయిలు 0.66 శాతం పెరిగాయి. దీంతో ఏడాదిలో మొండి బకాయిలు 2.94 శాతానికి చేరాయి. వ్యక్తికత రుణాల్లో నిరర్ధక ఆస్తులు 0.04 శాతం పెరిగి 0.94 శాతానికి పరిమితం అయ్యాయి. క్రెడిట్ కార్డు (Credit Card) వ్యయాలు 2022-23లో 34 శాతం పెరిగాయి. వ్యక్తిగత రుణాలు 29 శాతం అధికం అయ్యాయి. ఆస్తులపై ఇచ్చే రుణాలు అత్యంత వేగవంతమైన రిటైల్ ఉత్పత్తిగా నిలిచాయి. ఈ విభాగంలో 38 శాతం వృద్ధి నమోదైంది.
45 శాతం వాళ్లే..
రిటైల్ రుణాల్లో కీలకంగా భావించే గృహ రుణాలు తక్కువగా 14 శాతం పెరిగాయి. వడ్డీ రేట్ల పెంపు ప్రభావం వీటిపై స్పష్టంగా కనిపించింది. ఈ జనవరి-మార్చిలో రుణాలు తీసుకున్న వారిలో 31 నుంచి 45 ఏళ్లు ఉన్నవారు 45 శాతంగా ఉన్నారు.