TG: రాష్ట్రంలో MBBS సీట్లు ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. కొత్తగా 275 సీట్లు పెరగడంతో.. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో మొత్తం సీట్ల సంఖ్య 9,340కి చేరింది. జాతీయ వైద్య కమిషన్(NMC) 3 ప్రైవేటు కాలేజీల్లో 200 సీట్లు, ESI కాలేజీ(25), కొడంగల్ నూతన కాలేజీ(50)లో అదనంగా పెంచింది. MBBS కౌన్సెలింగ్ ముగింపు దశకు చేరగా, ఈసారి దాదాపు 70% మంది అమ్మాయిలే చేరారు.