SRD: పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టుకు 10,378 క్యూసెక్కుల వరద కొనసాగుతున్నట్లు నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్టాలిన్ ఆదివారం ఉదయం తెలిపారు. క్రమేపి గత నాలుగు రోజుల నుంచి వరద ప్రవాహం తగ్గుతూ వస్తుంది. దాంతో ఒక గేటు ద్వారా 9633 క్యూసెక్కులు దిగువకు రిలీజ్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 16.624 టీఎంసీల వద్ద నిలువ ఉంది.