మీకు ఐటీ రిఫండ్ వచ్చిందంటూ మెసేజ్ వచ్చిందా? దాంతో పాటు బ్యాంక్ ఖాతా సరిచేసుకోండి అంటూ ఏదైనా లింక్ పంపుతున్నారా? అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే.
ఐటీ రిఫండ్ (IT Refund) కోసం వేచి చూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.దీంతో కేంద్ర ప్రభుత్వం ఐటీఆర్ రిఫండ్ పై ఉద్యోగులను అలర్ట్ చేసింది.మీ బ్యాంక్ ఖాతా (Bank account) నంబర్ తప్పుంది.. వెంటనే సరిచేసుకోండి’ అంటూ మెసేజ్‌లు పంపుతూ డబ్బు కాజేయాలని చూస్తున్నారు. అసలే రిటర్ను మొత్తం ఖాతాలో జమ అయ్యే సమయం కావడంతో చాలా మంది నిజం అనుకొనే ప్రమాదం ఉంటుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం (Central Govt) రిటీ రిటర్ను దాఖలు చేసిన వారిని హెచ్చరిస్తూ ఓ ట్వీట్ చేసింది. చెల్లించాల్సిన పన్నుకు మించి ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ టీడీఎస్ విధించినప్పుడు రిటర్నులు సమర్పించి రిఫండ్ కోరేందుకు వీలుంటుంది.
సాధారణంగా రిటర్నులు దాఖలైన 7 నుంచి 120 రోజుల్లోపు ఆదాయపు పన్ను(Income Tax) విభాగం రిఫండ్ చెల్లిస్తుంది. ఇప్పటికే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు జులై 31తోనే గడువు ముగిసింది. అయినప్పటికీ పెనాల్టీ (Penalty) చెల్లించి ఫైలింగ్ చేయవచ్చు. ఇప్పటికే 6 కోట్ల మందికిపైగా రిటర్న్స్ దాఖలు చేశారు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు (Cyber criminals) తమ పని తనాన్ని చూపిస్తున్నారు. ఆదాయపన్ను (IT) రిటర్నులు ఆమోదం పొందాయంటూ మెసేజ్‌లు వస్తున్నాయి. ఇవన్నీ ఫేక్ మెసేజ్(Fake message)లు, ఆదాయ పన్ను శాఖ ఇలాంటి మెసేజ్‌లు ఎవ్వరికీ పంపదు. మీ వ్యక్తిగత సమాచారం తెలుసుకోవటం కోసమే ఇలాంటి మెసేజ్‌లు పంపుతుంటారు. వీటి పట్ల జాగ్రత్తగా ఉండండి’ అంటూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ట్వీట్ చేసింది. దాంతో పాటూ మెసేజ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ షేర్ చేసింది.