ఈ ఏడాది పండుగల సందర్భంగా తాత్కాలిక కార్మికులకు భారీ డిమాండ్ ఏర్పడింది. గతేడాదితో పోల్చితే గిగ్ వర్కర్ల డిమాండ్ 23 శాతం పెరిగినట్టు ‘అవ్సార్’ గివ్ వర్కర్స్ నివేదిక వెల్లడించింది. రిటైల్ రంగంలో వచ్చిన మార్పులు, కస్టమర్ల వినియోగం, వారి అంచనాలు పెరగడం వల్ల డిమాండ్ పెరిగిందని తెలిపింది. దేశ ఉపాధి రంగంపై గిగ్ ఎకానమీ దీర్ఘకాలం పాటు ప్రభావం చూపిస్తుందని అంచనా వేసింది.