నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని కొంత వాటాను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్ సీస్, యూకో, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుల్లోని వాటా అమ్మనున్నట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. సెబీ నిబంధనల ప్రకారం ప్రజల వాటాను 25 శాతానికి పెంచేందుకు ఈ చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొంది. మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఎంత వాటా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది.