గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. 19 కేజీల సిలిండర్ ధరను రూ.51.50 తగ్గించాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్ రేటు రూ.1580కు చేరింది. గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇది హైదరాబాద్లో రూ.905లుగా ఉంది.