వర్క్- లైఫ్ బ్యాలెన్స్ అంశంపై విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వర్క్- లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యమైన అంశం. కోవిడ్ కంటే ముందు ఈ విషయాన్ని తెలుసుకున్నా. ఆ తర్వాత వచ్చిన హైబ్రిడ్ వర్కింగ్ మోడల్ కూడా వర్క్- లైఫ్ బ్యాలెన్స్‌కు సాయపడుతుందని నమ్మాను. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి’ అని ఆయన అన్నారు.