నేషనల్ డిఫెన్స్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ 2026 పరీక్షల అడ్మిట్ కార్డులను UPSC విడుదల చేసింది. ఈ మేరకు హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ https://upsc.gov.in/లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 12న దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.