గడిచిన పదేళ్ల కాలంలో భారత ప్రత్యక్ష పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 182శాతం పెరిగి రూ.19.60 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మొత్తం వసూళ్లలో కార్పొరేట్ వసూళ్లు గడచిన పదేళ్లలో రెండింతలు పెరిగి రూ.9.11 లక్షల కోట్లకు, వ్యక్తిగత ఆదాయపు పన్ను 4రెట్లు పెరిగి రూ.10.45 లక్షల కోట్లకు చేరుకున్నాయి. పదేళ్ల క్రితం 2014-15 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.6.96 కోట్లుగా ఉన్నాయి.